పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంచి యజమానునికి చెడ్డసేవకుడొకడుండేవాడు. ఆ యజమానుడు ఈ దుష్టసేవకునికి నీతి గరపడంకోసం అతన్ని మరో యజమానుని వశంజేసాడు. ఈ రెండవ యజమానుడు సేవకుణ్ణి క్రూరంగా శిక్షించాడు . అప్పుడు దుష్టసేవకుడు బుద్ధితెచ్చుకొని, తొలి యజమానుడే మేలు! అతడు నన్ను తండ్రిలా ఆదరించేవాడు. కనుక అతనివద్దకే మల్లా తిరిగి వెళ్లాను అనుకున్నాడు. ఆ సేవకుని పరివర్తనం జూచి తొలి యజమానుడు జాలిపడి క్రయధనమిచ్చి అతన్ని విమోచించాడు. అతన్ని తన సొంతసొత్తు చేసికొని ఆదరంతో జూచాడు.” యావే యిస్రాయేలీయులను గాని క్రీస్తు నూత్న వేద ప్రజలనుగాని విమోచించిన తీరు ఈలాంటిది. దుడుకు చిన్నవాని సామెతను మనసులో బెట్టుకొని క్రిసోస్తం ఈ వుపమానం అల్లాడు. ఆ దుడుకు చిన్నవాని లాగే మనమూ తండ్రియైన దేవుణ్ణి ఆశ్రయిద్దాం.

23. కరుణాపీఠం - నిర్థ 25,17-22

}}

మీది యంశాల్లో క్రయధనాన్ని గూర్చి విచారించి చూచాం. ఇక "ప్రాయశ్చిత్తం" అనే భావాన్ని పరిశీలిద్దాం. ప్రభువు పది యాజ్ఞలను ఓ రాతి పలకపై వ్రాసి మోషేకిచ్చాడు. అతడు ఈ యాజ్ఞలను ఓ పెట్టెలో పదిలపరచాడు. ఈ పెట్టెకే మందసం అనిపేరు. ఎడారికాలాన ఈ మందసం గుడారంలో తెరవెనుక వుండేది. ఈ మందసంమీద ఓ బంగారు ఫలకం వుండేది. దీనికి కరుణాపీఠం లేక కరుణాఫలకం అనిపేరు. ఈ కరుణా పీఠంపై కెరూబులు అనబడే దేవదూతల బొమ్మలు రెండుండేవి. ఈ కెరూబులు విప్పిన రెక్కలతో కరుణాపీరాన్ని కప్పతూ ఆ ఫలకంవైపు చూసూన్నట్లుగా అమర్చబడి వుండేవి. కరుణాఫలంమీది యీ రెండు కెరూబుల మధ్యగల ఖాళీస్థలంలో నుండి ప్రభువు మోషేతో మాటలాడుతూండేవాడు. నిర్గమకాండ 25, 17-22లో ఈ వివరాలన్నీ చూడవచ్చు బైబులు భగవంతుడు కరుణ గలవాడు. అతడు మనపట్లా జాలిచూపుతూండాలని అడుగుకుందాం.

24. కరుణాపీఠం ఏం చేస్తుంది?

}}

కరుణాపీఠం మూడు పనులు చేసేది. మొదటిది, ఈ పీఠం యూవేకు సింహాసనంగా ఉపకరించేది. ప్రభువు దానిపై నెలకొని వుండేవాడు. అందుకే కీర్తన కారుడు "ఆయన కెరూబుల మీద ఆసీనుడై యున్నాడు" అంటాడు - 99,1. మొదటి సమూవేలు గ్రంథ 44 కూడ 'కెరూబుల మధ్య ఆసీనుడై సైన్యములకు అధిపతిగావుండే ప్రభువు మందసం తెప్పించారు" అంటుంది. ఈలా దైవ సాన్నిధ్యం నెలకొని వుండడంవల్ల గుడారంలో ఈ మందసముండే స్థలం పవిత్రమైంది. అందుకే సామాన్య ప్రజలు ఈ స్థలంలోకి ప్రవేశించేవాళ్ళ కాదు. ప్రధాన యాజకుడు యేడాదికి ఒకతూరి మాత్రమే ఈ పవిత్రస్థలంలో అడుగుపెట్టేవాడు. అతడూ మందస మీది కరుణాపీఠం వైపు చూచేవాడు గాదు. గుడారం లోపలికి వెళ్ళగానే ధూపం అర్పించి ఆ ధూపపుపొగ కరుణాపీఠాన్ని