పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అర్పించినట్లగా నూత్నవేద మెచ్చటా చెప్పదు, పూర్వ నూత్నవేదాలు ప్రజలు "కొనబడినవాళ్ళు" అంటాయి. కాని యావే ఫరోకుగాని, క్రీస్తు పిశాచానికిగాని సొమ్ము చెల్లించారు అని బైబులెక్కడా వాకొనదు. కొనుగోలు వల్ల మనం ప్రభువు సౌత్తు అయ్యాం. కలకాలం ఆ ప్రభువుకే చెందివుండే భాగ్యం ప్రసాదించమని అడుగుకుందాం.

20. పరిశుద్ధ ప్రజలు - 1 పేతురు 2,9.

1 పేతురు 2,9లో నిర్గమకాండ 19, 5-6 వాక్యాలు ఉదహరింపబడ్డాయి. ఈ వాక్యంలో చాలా భావాలు ఇమిడి వున్నాయి. 1. నూత్న వేద ప్రజలు పూర్వవేద ప్రజల్లాగే "పరిశుద్ధ జనం" పూర్వవేద ప్రభువూ నూత్నవేద ప్రభువూ ఈ ప్రజను ఎన్నుకొని వీళ్ళతో ఒడంబడిక చేసికున్నారు గనుక వీళ్ళ పరిశుద్ధ ప్రజలయ్యారు. 2. ఈ ప్రజ “రాజులైన యాజక సమూహం". యావేను క్రీస్తును కొలిచి ఆరాధించేవాళ్లు గనుక ఈ జనులు యాజకులు. భగవంతుని సేవించే వాళ్ళ కావడంచేత వీళ్ళ రాజులు. బైబులు భావాల ప్రకారం భగవంతుణ్ణి సేవించేవాళ్ళు అతని కొలువుకాళ్ళు. కనుక ప్రభువును సేవించడమనగా రాచరికం చేయడమే. 3. ఈ ప్రజ దేవుని "సాత్తు". యావే క్రీస్తు యూ ప్రజను ఫరోనుండి పిశాచాన్నుండి విడిపించి తమ సొంతసొత్తు చేసికున్నారు. ఇకమీదట వీళ్ళ ఈ ప్రభువులకు చెందినవాళ్ళు ఈలా పూర్వనూత్నవేద ప్రజలు పరిశుద్ధ ప్రజలు, రాజులైన యాజకులు, దేవుని సొత్తు. ఈ మూడు లక్షణాలూ మనపట్లా అక్షరాల వర్తించాలని అడుగుకుందాం.

21. నీ రక్తమిచ్చి ప్రజలను కొన్నావు - దర్శ 5,9.

దర్శనగ్రంథం 5,10లో "నీ రక్తమిచ్చి దేవుని కొరకు ప్రజలను కొన్నావు. వారిని మా దేవునికి యాజకులనుగాను, రాజ్యంగాను నియమించావు" అని పెద్దలు క్రీస్తునుద్దేశించి క్రొత్తపాట పాడతారు. ఇక్కడ క్రీస్తు మన విమోచనం కొరకు స్వీయరక్తాన్నేక్రయధనంగా ఒడ్డాడని చెప్పబడింది. ఈలా విమోచింపబడిన ప్రజలు ఏలా యాజకులూ రాజులూ ఔతారో ముందే వివరించాం. ఇదే గ్రంథం 14,3 లో గూడ మోక్షవాసులను "కొనబడినవాళ్లు" అనిపిలుస్తుంది. క్రీస్తు వీళ్ళను పిశాచ దాస్యాన్నుండి కొన్నాడని పూర్వమే విశదీకరించాం. ప్రభువు నెత్తురు మన విలువ. ఈ యంశాన్ని తలంచుకొని భక్తిభావంతో మననం చేసికుందాం.

22. వెండి బంగారాలతో గాదు - 1 పేతురు 1, 18.

1 పేతురు 1,18లో మనం వెండి బంగారంలాంటి క్షుద్ర వస్తువుల చేతగాక, అమూల్యమైన క్రీస్తు రక్తంచేత విమోచింపబడ్డామని చెప్పబడింది. ఈ వాక్యంమీద వ్యాఖ్యవ్రాస్తూ నాల్గవ శతాబ్దికి చెందిన పునీత క్రిసోస్తం" ఓ