పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36, 25-28. పై ఐగుప్త దాస్య విమోచనంలాగే ఈ బాబిలోను దాస్యవిమోచనం గూడ నూత్నవేదంలో క్రీస్తు ఆర్థించబోయే పాపవిమోచనాన్ని సూచిస్తుంది. కనుక దాస్య విమోచకుడైన ప్రభువు మనలనూ పాపదాస్యాన్నుండి విమోచించాలని ప్రార్థిద్దాం.

5. ఆకాశమా రక్షకుని వర్షించు - యెష 45,8.
చివరినాళ్ళలోని పూర్వవేదప్రజలు గంపెడంత ఆశతో రక్షకుని కోసం ఎదురుచూచారు. "ఆకాశమా రక్షకుని వర్షించు! భూమీ నీతిమంతుని మొలకెత్తించు!" అని ప్రార్ధించారు - యెష 45,8. అనగా ఆకాశంనుండి వాన వచ్చినట్లుగానే రక్షకుడూ రావాలనీ, భూమినుండి పైరు మొలకెత్తినట్లుగానే రక్షకుడూ మొలకెత్తాలనీ ఆ ప్రజల కోరిక. యెషయా ప్రవచనం 53, 10 ప్రకారం ఈ రక్షణం ఒక్క యూదప్రజలకు మాత్రమేగాక, సమస్త జాతులకూ లభిస్తుంది. భూదిగంతాల వరకూ నివసించే సమస్త జాతి జనులూ ప్రభు రక్షణాన్ని దర్శిస్తారు. క్రీస్తు రాకముందు రెండు శతాబ్దాల కాలం కుమ్రాను కొండల్లో వసించిన యెస్సీను భక్తులు ఈ రక్షకుని కోసం యెదురు చూచారు. గ్రీకు రోమను తాత్వికులూ ఈ రక్షకుని దర్శింపగోరారు. మన దేశంలోని హైందవ ఋషులూ అవతారవాదాన్ని సృజించి తారకునికోసం ఎదురుచూచారు. ఇన్ని దేశాల్లో ఇన్ని కాలాల్లో ఇందరు మహాభక్తులు యెదురుచూచిన ప్రభువును అంగీకరించి అనుసరించే భాగ్యం మాత్రం మనకు అబ్బింది!

6. అతనికి రక్షకుడని పేరు - మత్త 1.21.

పైన నుడివిన మహాభక్తుల ప్రార్ధనా ఫలితంగా, యావే ప్రభువు పంపగా వచ్చిన క్రీస్తు మన మంటి మీద అవతరించాడు. అతనికి "రక్షకుడు" అని పేరు. ప్రజలను పాపాన్నుండి రక్షిస్తాడు గనుక ఈ పేరు పెట్టారు. (హీబ్రూ భాషలో రక్షకునకు "యెహోషువా" అని పేరు. ఈ పేరే గ్రీకు అనువాదంలో "యేసుస్" ఐంది. తెలుగు బాషలోకి వచ్చేప్పటికల్లా "యేసు" లేక "జేసు" ఐంది). ఈ శిశువు జన్మింపక ముందే జెకర్యా "ఆయన సేవకుడైన దావీదుని వంశంలో దృఢమైన రక్షణాన్ని నెలకొల్పాడు" అని యీ బిడ్డను గూర్చి ప్రవచనం పల్మాడు - లూకా 1, 69. ఈ శిశువు జన్మించాక సిమ్యోను యీ బిడ్డను జూచి "నీవు సకల ప్రజలకు సిద్ధం చేసిన యీ రక్షణాన్ని నేను కన్నులార జూచాను" అని తండ్రిని స్తుతించాడు - లూకా 2.30 ఔను, సకల ప్రజలకోసమూ మన కోసమూ ఉద్దేశింపబడిన రక్షణం క్రీస్తు!

7. నేడు ఈ యింటికి రక్షణం లభించింది - లూకా 19,9.

ఈ ప్రభువు పట్టిన నాటినుండి చనిపోయేవరకూ రక్షకుడుగానే వ్యవహరించాడు. బహిరంగ జీవితంలో అతడు నిర్వహించిన రక్షణకార్యాలు చాలావున్నాయి. జక్కయలాంటి 29