పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయించాడు. న్యాయా 15, 18 ప్రకారం ఆది ప్రభువిచ్చిన రక్షణం. రెండవ దశలో ప్రభువు ప్రజను ఈజిప్టు బానిసాన్నుండి రక్షిస్తాడు, ఐగుప్తియులు తమ్ము తరుముకుంటూ రావటం జూచి యూదులు భీతిజెందారు. మోషేవారిని హెచ్చరించి "భయపడకండి. యావే మీకు ప్రసాదించబోయే రక్షణాన్ని నేడే కన్నులారజూస్తారు" అంటాడు - నిర్ణ 14, 13. మూడవదశలో ప్రభువు ప్రజను పాపాన్నుండి రక్షిస్తాడు. యెషయా 33, 2224 ప్రకారం యావే న్యాయాధిపతి. అతడు ప్రజలను రక్షిస్తాడు. వాళ్ళ పాపాలను పరిహరిస్తాడు. ఈలా బైబుల్లో రక్షణపదం మొదట శత్రువులనుండి తప్పించుకోవడానికి, ఆ పిమ్మట ఈజిప్టునుండి తప్పించుకోవడానికి, అటుపిమ్మట పాపాన్నుండి పరిహారం పొందడానికి వాడబడింది. రానురాను ఈ రక్షణశబ్దం ప్రభువిచ్చే సమస్తభాగ్యాలను సూచిస్తుండేది. మనమూ ప్రతినిత్యం ప్రభురక్షణాన్ని పొందుతుంటాం!

3. ఐగుప్న దాస్యాన్నుండి రక్షణం - నిర్గ 3,10

ప్రభువు వెూషే ద్వారా ఐగుప్నలోని తన ప్రజలను రక్షించాలని సంకల్పించుకున్నాడు. ఐగుప్త పాపపు దేశం, ఎందుకంటె అచటి ప్రజలు ప్రభువును గాక విగ్రహాలను కొలిచేవాళ్ళు, కనుక ప్రజలు ఐగుపునుండి దాటివచ్చాక ఆ దేశానికి వెలుపల హోరెబు పర్వతం మీద ప్రభువును ఆరాధించాలి - నిర్గ 3,12, ఐగుప్త దేశానికి .దూరంగా యెడారిలో ఉత్సవం జేసికోవాలి - 5,1. ఐగుప్న విగ్రహాలను ఆరాధించే పాపపు దేశం - యోషు 24, 14. కనుకనే ప్రభువు తన ప్రజలను ఈ దేశాన్నుండి ఆవలకు నడిపించుకొని పోయాడు. ఈలా నడిపించుకొని పోవడమే రక్షణం. పూర్వవేదప రక్షణాలన్నిటిలోను ఈ ఐగుప్న రక్షణం ముఖ్యాతి ముఖ్యమైనది. ఇది నూత్న వేదంలో క్రీస్తు సాధించబోయే రక్షణాన్ని సూచిస్తూ వుంటుంది. పూర్వ వేదపు భగవంతుడుగాని నూత్న వేదప భగవంతుడుగాని ప్రధానంగా "రక్షకుడు". కనుక ఆ ప్రభువు ప్రసాదించే రక్షణానికి మనమూ పాత్రులం గావాలని అడుగుకుందాం.

4. బాబిలోను దాస్య విముక్తి - యెహెజ్కేలు 34,23.

క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దిలో నెబుకద్నెసరు అనే రాజు యూదులను బాబిలోను దేశానికి బందీలనుగా గొనిపోయాడు. ఇది రెండవ బందీగ్రహణం. యూదులు ఆ దేశంలో 70 యేండ్లు ప్రవాసబాధ లనుభవించాక ప్రభువు మళ్ళా వాళ్ళను రక్షించడానికి పూనుకున్నాడు. యెహెజ్కేలు ప్రవచనం ప్రకారం యావే తన ప్రతినిధియైన అభిషిక్తుని పంపిస్తాడు. అతడు ప్రజలనే గొర్రెలను కాపరిలా కాచి సంరక్షిస్తాడు - 34, 22-24 ఇతడే మెస్సీయా, కాని ప్రభువిచ్చే యిూ రక్షణం బాబిలోను బంధనం నుండి మాత్రమేగాదు, పాపాన్నుండిగూడ ప్రజలను రక్షిస్తుంది. ప్రభువు ప్రజలకు క్రొత్త హృదయాన్నిక్రొత్త ఆత్మను అనుగ్రహిస్తాడు. వాళ్ళ అతన్ని కొలిచే ప్రజలౌతారు. అతడు వాళ్ళను రక్షించే దేవుడౌతాడు 28