పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. రక్షణం

బైబులు భాష్యం - 6

విషయసూచిక

1. రక్షణం నంబర్లు 1-11
2. విమోచనం " 12 - 17
3. క్రయధనం " 18 -22
4. ప్రాయశ్చిత్తం 23 - 30
5. నెత్తురు చిలకరించడం 99 31 - 47
(1) పాస్క గొర్రెపిల్ల నెత్తురు 31 - 34
(2) నిబంధన రక్తం 35 - 40
(3) ప్రాయశ్చిత్త బలులు 41 - 47
6. సూచక వ్యక్తులు 48 - 56
7 క్రీస్తు మనోభావాలు 57 - 63

1. ప్రభువే రక్షణాన్ని ప్రసాదించేవాడు - యెష 12,2

బైబులు చాల తావుల్లో ప్రభుని "రక్షకుడు" అని పిలుస్తుంది. ద్వితీ 32, 15 ప్రకారం యిస్రాయేలు ప్రజలు క్రొవ్వి కన్నుగానక యావేను విస్మరించారు. ప్రభువు వారికి రక్షణాన్ని ప్రసాదించేవాడు. రాతిమీద నిలిస్తే యేలా సురక్షితంగా వుంటుందో ఆ ప్రభువమీద ఆధారపడితే అలా సురక్షితంగా వుంటుంది. యెషయా ప్రవచనం 12,2 ప్రభువే నాకు రక్షణం ప్రసాదించేవాడు అంటుంది, అదే ప్రవచనం బాధామయ సేవకుడ్డిగూర్చి మాటలాడుతూ "భూదిగంతాలవరకు నా రక్షణం వ్యాపించేలాగ నిన్ను అన్యజాతులకు వెలుగుగా నియమించాను" అంటుంది - 49,6. కనుక ఈ వాక్యాలన్నీ ప్రభుని రక్షకుడు అని పేర్కొంటాయి. ఆ ప్రభువు మనకూ రక్షకుడు కావాలని ప్రార్థిద్దాం.

2. రక్షణంలో మూడు దశలు

కాని ప్రభువు రక్షకుడు ఏలా అయ్యాడు? అతడు ప్రజను దేనినుండి రక్షిస్తాడు? యిస్రాయేలీయుల తలంపుల ప్రకారం ప్రభువిచ్చే రక్షణంలో మూడుదశలు కన్పిస్తాయి. మొదటిదశలో ప్రభువు కేవలం శత్రువులనుండి ప్రజను రక్షిస్తాడు. సంసోను ఫిలిస్టీయులను