పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాపపు మానవుడు పాపపు ఆదాముతో కలసి పోయినట్లే రక్షితుడైన మానవుడు రక్షకుడైన రెండవ ఆదాముతో కలసిసోతాడు. ఆమీదట అతడు క్రీస్తునందు క్రొత్తప్రాణి ఔతాడు - 2 కొ 5,17. శరీరమందుగాక ఆత్మయందు జీవిస్తాడు - రోమ 8,9. అతడుగాదు, అతనియందు క్రీస్తే జీవిస్తూవుంటాడు - గల 2, 20.

58. దైవజ్ఞానం -1కొ 1.25

తండ్రి క్రీస్తు ద్వారా మన పాపాన్ని పరిహరించాడు, నిర్మూలించాడు. ఈ పాప నిర్మూలనం తండ్రి విజ్ఞానాన్ని చాటుతుంది. క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానం. నరులు దేవుడు వెర్రివాడనుకున్నారు. కాని దేవుని వెర్రితనం నరుల జ్ఞానంకంటె మించిన జ్ఞానం1 కొ 1, 24. దేవుడు తన్ను ప్రేమించేవారికి యెల్లవిషయాలు మేలు కలిగించేలా చేస్తాడు - రోమ 828. కనుక పాపంకూడ తన భక్తులకు కీడు కాదు మేలు కలిగించే లాగే చేస్తాడు. ఈలా క్రీస్తు తండ్రి క్రీస్తు ద్వారా నరులను రక్షించి పాపపరిహారం చేయాలి అనుకోవడాన్నే పౌలు చాలా తావుల్లో “రహస్యం” లేక "మర్మం" అని పిలుస్తాడు - ఎఫె 19. ఇదే అనాదికాలంనుండి తండ్రి సిద్ధంచేసిన రక్షణప్రణాళిక యీ ప్రణాళికకు కట్టువడే క్రీస్తు మనలను రక్షించారు.

59. మీరు ఖరీదు పెట్టి కొనబడినవాళ్లు = 1కొ 7,23.

ఈలా క్రీస్తుద్వారా రక్షితుడైన నరుడు క్రీస్తునందు జీవిస్తుండాలి. తనకోసంగాక క్రీస్తుకోసం బ్రతుకుతూండాలి. పౌలు కొరింతీయులకు వ్రాస్తూ "మీరు మీ సొత్తుకాదు, ఖరీదు పెట్టి కొనబడినవాళ్ళు" అని హెచ్చరించాడు 1 కొ 7,23. ఏం ఖరీదు? పూర్వవేదంలోని యూదుల్లో ఎవరైనా పేదతనంవల్ల బానిసలుగా అమ్ముడు పోయినట్లయితే, వారి దగ్గరి బంధువులు మూల్యమిచ్చి మళ్ళా ఆ బానిసలను యజమానుల వద్దనుండి కొనేవాళ్ళు ఈలా వాళ్ళకు విడుదల లభించేది. ఈ మూల్యానికే క్రయధనమనిపేరు. యిస్రాయేలు ప్రజలు ఈజిప్టులో ఫరోరాజులకు బానిసలుగా వున్నపుడు యావే ప్రభువు వాళ్ళను విడుదల చేయించాడు. కాని యిక్కడ యావే ప్రభువు ఫరో రాజులకు క్రయధన మేమీ చెల్లించలేదు. ఇక నూత్నవేదంలోని ప్రజలమైన మనం పాపంద్వారా పిశాచమనే యజమానునికి బానిసలమైపోయాం. క్రీస్తు సిలువ మరణం చెంది మనలను ఈ బానిసాన్నుండి విడిపించాడు. అతడు తన నెత్తటినే మన తరఫున క్రయధనంగా ఒడ్డాడు. కాని ప్రభువు తన నెత్తురును పిశాచానికి క్రయధనంగా సమర్పించలేదు. ఈ నెత్తురే