పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6, 12 చావునకు లోబడిన శరీరం అంటుంది. ఈ శరీరం దేవునకు విరోధమైంది - రోమ 8,7. మృత్యువునకు దారి తీసేది - రోమ 8,13.

పూర్వవేదంలో "శరీరం" అంటే బలహీనపునరుడు. నాశమయ్యే నరుడు. అందుకే యెషయా "సర్వశరీరులును గడ్డివంటి వాళ్లు, వాళ్ల అందమంతా అడవి పూవు లాంటిది" అన్నాడు - 40,6. పౌలు జాబుల్లో శరీరమంటే పాపం పనిచేసే కార్యరంగం. పాపం శరీరాన్ని సాధనంగా వాడుకొని నరుని చేత పాపం చేయిస్తుంది. అంచేత పాపంలాగే శరీరం కూడ నరునికి శత్రువౌతుంది.

55. పాపమిచ్చే జీతం మరణం - రోమా 7,23.

పాపం తనకు పనిచేసే వాళ్లకిచ్చే వేతనం మరణం. అనగా పాపం చేసే నరుడు చనిపోతాడు - రోమా 628. ఇక్కడ చనిపోవటమంటే యేమిటి? పాపి యీ భౌతిక జీవితానికీ మరణిస్తాడు, శాశ్వత మోక్షజీవితానికీ మరణిస్తాడు. అనగా అతడు శారీరకంగా చనిపోతాడు. ఆ పిమ్మట మోక్షానికి వెళ్ళడమూ ప్రభుదర్శనం పొందడమంటూ వుండదు. నీతిమంతులు రక్షింపబడుతూవుంటే పాపులు నశిస్తూవుంటారు - 1 కొ 1, 18.

56. శత్రువర్గాలు

నరుణ్ణి పాపానికి పురికొల్పే శక్తులు నాలున్నాయి. మొదటిశక్తి నరునిలోని ఆశాపాశాలు, ప్రతివాడు స్వీయ దురాశలచేత యూడ్వబడి శోధనలు పొందుతూన్నాడు అంటుంది యాకోబు జాబు 1, 18. రెండవది, లోకం - 1 యోహా 2,16, విశేషంగా లోకంలోని ధనమూ సిరిసంపదలూ నరుడ్డి శోధిస్తాయి - 1తిమొు 6,9. మూడవది, శరీరం, శరీరం ఆత్మకు విరోధంగా పనిచేస్తుంది - గల 5, 17. నాల్గవది, పిశాచం, లోకమంతా పిశాచప్రభావానికి లోనైయుంది -1 యోహా 5,19. యూ నాలుగు శత్రువర్గాలనుండి క్రీస్తు పరిశుద్దాత్మద్వారా మనలను రక్షిస్తాడు.

57. ప్రభువైన యేసునుండి రక్షణం - రోమా 7,25

నరుడు పాపానికి బానిస అయ్యాడు. అతడు మంచికార్యాలు చేయాలనుకున్నా గూడపాడు కార్యాలే చేస్తున్నాడు. అతనిలో యేదో శక్తివుండి అతన్ని చెరబడుతూ వుంది. సొంతశక్తితో యీ పాపాన్ని జయించలేక అతడు బాధపడుతూ వున్నాడు. ఇక, అతన్ని కాపాడి రక్షించేదెవరు? ప్రభువైన యేసు - రోమ 7, 25.