పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51. పాపాల జాబితాలు

ఇంతవరకు నాల్లు సువార్తలు పాపాలను గురించి బోధించే భావాలను విచారించి చూచాం. ఇక, పౌలుకూడ తాను వ్రాసిన 14 జాబుల్లో పాపాన్ని గూర్చి విస్పష్టభావాలు వెల్లడిచేసాడు. కనుక అతని భావాలనుకూడ కొన్నింటిని పరిశీలించి చూద్దాం. మొదట, ప్రవక్తల్లాగే పౌలుకూడ పాపాల జాబితాలను పేర్కొన్నాడు. రోమీయుల జాబు 1, 2931లోను, 2తిమొతి 3, 2-5లోను, 1 కొరింతీయులు 6,9-10లోను ఈ జాబితాలను చూడవచ్చు. ఈలాంటి పాపాలను చేసేవాళ్ళ దైవరాజ్యంలో ప్రవేశింపలేరన్నాడు పౌలు.

52. నేను మేలికార్యాలు చేయక పాడుకార్యాలే చేస్తున్నాను - రోమా 7,19.

పౌలు దృష్టిలో పాపం యెలాంటిది? తొలి మానవుడైన ఆదాము ద్వారా పాపం లోకంలో ప్రవేశించింది - రోమా 5,12. అప్పటినుండి అందరూ పాపం చేస్తూనేవచ్చారు. అందరూ దేవుని యనుగ్రహం ద్వారా నీతిమంతులు కావలసినవాళ్ళే - రోమా 3, 23. అందరూ పాపానికి అమ్మడుపోయినవాళ్ళే - రోమా 7,14

పౌలు తన అనుభవాన్ని చెప్పకున్నాడు. అతనికి మేలికార్యాలు చేయాలనీ పాడుకార్యాలు చేయకుండా వుండాలనీ కోరికవుంది. కాని ఈ కోరిక ప్రకారం నడువలేక పోతున్నాడు. చివరకు మేలికార్యాలు మానివేసి పాడుకార్యాలే చేస్తున్నాడు - రోమా 7, 18-19. ఇది పౌలు పాపానుభవం. నరులందరి అనుభవం కూడాను.

53. పాపం నన్ను మోసపుచ్చింది - రోమా 7, 11.

పౌలు చాల తావుల్లో పాపాన్ని ఓ వ్యక్తిగా భావించాడు. పాము ఏవను మోసపుచ్చింది - ఆది 3, 13, ఈలాగే పాపం కూడ నరుడ్డి మోసపుచ్చుతుంది - రోమా 7.11. అనగా పాపం సర్పరూపంలో వున్న పిశాచం లాంటిదని భావం. యూదులు క్రీస్తునకు సిలువ మీద శిక్ష విధించారు. కాని దేవుడు క్రీస్తుని యందు పాపానికి శిక్ష విధించాడు - రోమా 8,3. అనగా యూదులు క్రీస్తును శిక్షించినట్లే దేవుడూ పాపాన్ని శిక్షించాడని భావం. ఈ వాక్యాల్లో పాపం ఓ భావం కాదు, ఓ వ్యక్తి ఈ వ్యక్తిని గూర్చే యోహాను కూడ “యూ లోకాధికారి శిక్షను పొందాడు" అని వ్రాసాడు - 16,11 ఇతడే పిశాచం.

54. శరీరానుసారంగా ప్రవర్తించే వాళ్లు చనిపోతారు - రోమ 8, 13

పౌలు చాల తావుల్లో శరీరాన్ని గూర్చి మాటలాడతాడు. ఈ శారీర శబ్దం అతని జాబుల్లో ఓ పారిభాషిక పదం. గల 5,16 శరీరేచ్ఛలను పేర్కొంటుంది. రోమ