పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాడ్డం మహా ద్రోహంగా యెంచాడు. అట్లని యూదులు యెరూషలేమని మర్చిపోలేదు. ఆ పుణ్యనగరాన్ని విస్మరిస్తే తన చేయి చచ్చుపడాలనీ, తన నాలుక అంగిటికి అతుక్కొని పోవాలనీ ఈ భక్తుడు శాపనార్థాలు పల్కాడు. తమ శత్రువులైన బాబిలోనీయులు నాశమైపోవాలని కోరుకొన్నాడు. మనం కూడ రక్షణదాతయైన ప్రభువుని ఏనాడు విస్మరించకూడదు.

138, స్తుతి గీతం

ఈ పాట కట్టిన భక్తుణ్ణి ప్రభువు ఏదో ఆపదనుండి కాపాడాడు. కనుక అతడు దేవళానికి వచ్చి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతి అర్పించాడు. నేను కష్టకాలంలో వున్నపుడు నీవు నన్ను కాచి కాపాడావు అని చెప్పకొన్నాడు. ప్రభువు దయ ఎంత గొప్పది అనగా అతడు మహోన్నత స్థానంలో వుండి కూడ నేలమీది దీనులను గమనిస్తూంటాడు. అలాంటి ప్రభువుని మనం కూడ కొనియాడదాం,

139. సర్వజ్ఞుడైన ప్రభువు

ఇది నీతిబోధకమైన కీర్తన. బైబుల్లోని గొప్ప కీర్తనల్లో వొకటి. దేవునికి అన్నీ తెలుసు. అతడు మన హృదయంలోని ఆలోచనలు కూడ గమనిస్తూంటాడు. ఆ ప్రభువు అంతటా వుంటాడు, తూర్పు పడమరలందూ, పైన క్రిందా, చీకటిలో గూడ వుంటాడు. అతడు సర్వశక్తిమంతుడు. మనం మాతృగర్భంలో పిండంగా ఏర్పడినపుడే మనలను గమనించేవాడు. మొదటి నుండి మన స్వభావం బాగా తెలిసినవాడు. మన భవిష్యత్తు మనకు తెలియకపోయినా అతని బాగా తెలుస్తుంది, మనం నరులను మోసగించవచ్చుగాని దేవుణ్ణి మోసగించలేం. మనలను గూర్చి మనకు తెలిసినదానికంటే అతనికి అధికంగా తెలుసు. కనుక మనలను మనం నమ్మకంతో అతని చేతుల్లోకి అర్పించుకొందాం.

140. దుషుల నుండి రక్షణం

ఈ పాట కట్టిన భక్తుణ్ణి దుషులు బాధించి బెదిరించారు. కనుక అతడు ప్రభువు మరుగుజొచ్చి నన్ను కాపాడమని మనవిజేసికొన్నాడు. దేవుడు పేదలకోప తీసికొనేవాడనీ, దీనులకు న్యాయం చేకూర్చి పెట్టేవాడనీ అతడు పూర్ణంగా నమ్మాడు. కనుకనే ప్రభుని శరణువేడాడు. ప్రభువు రోజూ దేశంలో పేదలకు జరిగే అన్యాయాలను చక్కదిద్దాలని వేడుకొందాం.

141. ప్రలోభం నుండి తప్పకోవడం

ఈ పాట చెప్పిన భక్తుడు పేదవాడు. అతడు బలవంతులూ ధనవంతులూ ఐన దుష్టులతో కలసిపోయి వారి దుష్కార్యాల్లో పాల్గొనే ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రలోభం నుండి తన్ను కాపాడమని ప్రభువుని వేడుకొన్నాడు. దుర్మారుల మన్నన తనకు అక్కరలేదన్నాడు. దుషులు తన కొరకు పెట్టిన బోనునుండి తన్ను కాపాడమన్నాడు. తన ప్రార్ధన దేవాలయంలో వేసే సాంబ్రాణి పొగలాగ, సాయంకాలం దేవాలయంలో అర్పించే