పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188. సోదర ప్రేమ

ఇది ఐకమత్యాన్ని కొనియాడే కీర్తన. పాస్క పండుగను జరుపుకోవడానికి యూదులు పలుదేశాల నుండి యెరూషలేముకి వచ్చేవాళ్లు. ఆ తిరునాళ్ళలో పట్టణంజనంతో క్రిక్కిరిసి వుండేది. నగరంలో ప్రోగయిన జనాన్ని చూస్తే, ప్రధాన యాజకుని అభ్యంగన సమయంలో పరిమళశైలం సువాసనలు ఒలికినట్లుగా ఆనందకరంగా వుండేది. సియోనున మంచు కురిసి వేడిమిని తగ్గించినట్లుగా ఆహ్లాదంగా వుండేది. చాలమంది కలసిమెలసి జీవించడం కష్టం.ఐనా బృందజీవితం ఆనందకరమైంది. క్రీస్తు మనం కలసివుండాలనే కోరుకొన్నాడు. ఎప్పడు కూడ ఐక్యం భగవంతుని నుండి, విభజనం పిశాచం నుండీ వస్తాయి.

134. రాత్రికాల గీతం

యెరూషలేముకి యాత్ర వచ్చిన భక్తులు రేయి దేవళంలో సేవలు చేసే యాజకులనూ లేవీయులనూ దీవించారు. ఆ యాజకులు సృష్టికర్తయైన దేవుడు మిమ్ము దీవించునుగాక అని యాత్రికులను ఆశీర్వదించారు. ఈ గీతం రాత్రి పండుకోవడానికి ముందు పించడానికి అనువైంది.

135. స్తుతిగీతం

ఇది ప్రభుని కీర్తించమని చెప్పేస్తుతిగీతం. అతడు సృష్టిచేసినవాడు. చారిత్రకంగా యిస్రాయేలును రక్షించిన వాడు. విగ్రహాలతో పోలిస్తే అతడు మహా శక్తిమంతుడు. అవి శక్తి చాలనివి. అలాంటి దేవుణ్ణి కొనియాడవద్దా? ఆతడు నేడు మనలను కూడ సృష్టించాడు. రక్షించాడు. అలాంటి మహా ప్రభువుని మనం కూడ వినుతిద్దాం.

136. వందన గీతం

ఇది బృందగీతం. దేవాలయంలో లేవీయులు చరణాలు పాడగా భక్తసమాజం “అతని ప్రేమ కలకాలం వుంటుంది" అని పల్లవి పాడేవాళ్లు. ఇది హలెల్ గీతం. ఈ గీతాలు ప్రభుని స్తుతిస్తాయి. కీర్తనకారుడు దేవుడు సృష్టి చేసినందుకూ యిప్రాయేలుని రక్షించినందుకూ అతన్ని కీర్తించాడు. నేడు మన జీవితానికి గూడ ఈ రెండంశాలు వర్తిస్తాయి. మనపట్ల గూడ అతని ప్రేమ కలకాలం వుంటుంది. మనం కూడ అతన్ని భక్తితో స్తుతించాలి.

137. ప్రవాస గీతం

ఇది విలాపగీతం. 587లో యిస్రాయేలీయులు బాబిలోనియాకు ప్రవాసులుగా వెళ్ళారు. అక్కడ ఆ దేశీయులు యూదులను మీ సియోను గీతం ఒకటి పాడి విన్చించండని అడిగార.కాని వాళ్ళ పాడలేదు. ఈ కీర్తన కట్టిన భక్తుడు పరాయి గడ్డమీద ప్రభుగీతం