పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరలోకానికీ విరోధంగా పాపం చేసాను" అంటాడు - 15, 21. ఇక్కడ పరలోకమంటే దేవుడు. అతడు దేవునికి, తన తండ్రికి విరోధంగా పాపం చేసాడు. కాని యిక్కడ దుడుకు చిన్నవాడు చేసిన పాపం ఏమిటి?

పెద్ద కుమారుడు అన్నట్లు ఆస్తిని దుర్వ్యయం చేయడమా? (15,30) కాదు. దుడుకు చిన్నవాని పాపం తండ్రి సన్నిధిలోనుండి వెళ్ళిపోవడం, తండ్రిని ప్రేమించడానికి నిరాకరించడం, ఆ తండ్రిపట్ల కుమారుల్లా ప్రవర్తించకుండా వుండడం. పైగా తండ్రి అధికారాన్నిధిక్కరించి తాను స్వతంత్రంగా వండాలని కోరుకోవడం, ఆదాము పాపంకూడ యిదే! అక్కడ ఆదాము, ఇక్కడ దుడుకు చిన్నవాడూ, యిద్దరూ అవిధేయులే.

కావున అతడు తండ్రినివీడి దూరదేశానికి వెళ్ళాడంటే స్వతంత్రంగా వుండాలని కోరుకున్నాడు. తండ్రి అధికారాన్నిధిక్కరించి తనంతట తాను బ్రతకాలని వాంఛించాడు. కాని ఈ వాంఛే అతన్ని దుర్వ్యసనాలకు మరల్చింది. దిక్మూమొక్కూలేని దీనుణ్ణిగా తయారు చేసింది. ఐనా తండ్రి అతన్ని వదలిపెట్టలేదు. పితృవాత్సల్యంతో అతని రాకకోసం ఎదురుచూస్తూనే వున్నాడు. అతడు తిరిగిరాగానే ఆదరంతో స్వీకరించాడు. చిన్నవాడు తండ్రి ప్రేమను మరలా చవిచూచాడు. ఆ యింట్లో తాను బానిసగాదు బిడ్డడు అని అనుభవపూర్వకంగా తెలిసికున్నాడు. దేవుడు పాపినిగూడ ఈలాగే చూస్తాడు.

42. కారుణ్యపు సామెతలు - లూకా 15.

లూకా 15వ అధ్యాయంలో పాపాత్ములపట్ల భగవంతుడు చూపే కారుణ్యాన్ని చిత్రించే సామెతలు మూడున్నాయి. అవి తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కాసు అనే సామెతలు. ఈ మూడింటిలోను విషయ మొక్కటే. భగవంతుని జూలి.

భగవంతుణ్ణి విడచిపోయినప్పడు ఈ ముగ్గురూ బాధలనుభవిస్తారు. గొర్రెమేపరిని విడచిపోయి ముండ్లల్లో చిక్కి బాధపడుతుంది. కుర్రవాడు తండ్రిని విడచిపోయి ఆకటికి చిక్కి అలమటిస్తాడు. నాణెం యజమానురాలిని విడచి చీకట్లో వండిపోతుంది. సృష్టికర్తయైన భగవంతునికి దూరమైపోయినప్పడు సృష్టిప్రాణి అస్తిత్వానికి ఇక అర్థమేలేదు. గొర్రె కాపరిని విడచి పోయినప్పడు అతనికేమి ఉపయోగం కలిగిస్తుంది? కుర్రవాడు తండ్రిని విడచి పోయినపుడు ఆ తండ్రికెలా వుపకరిసాడు ? నాణెం యజమానురాలి వస్త్రంనుండి జారిపడిపోయినప్పడు ఆమెకెలా అక్కరకు వస్తుంది? భగవంతుణ్ణి విడచిపోయిన నరుడూ ఈలాగే, కాని యీ భగవంతుడు ఓ తండ్రిలాగ తన బిడ్డలు మళ్లా తిరిగి రావాలనే కోరుకుంటూంటాడు. ఔను. పాపియైన నరుడు ఆ తండ్రివద్దకు తిరిగిపోవాలి, అతనితో సమాధానపడాలి. ఇది బైబులు బోధించే పశ్చాత్తాపం.