పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నమ్మదగినతనమే అతని ముఖ్యగుణం. ఇంకా, అతడు న్యాయబుద్ధి, దయ కలవాడు. రక్షణను దయచేసేవాడు. పరమపవిత్రుడు. అతని యెదుట మనం భయభక్తులతో మెలగాలి. దైవభీతికలవాడే వివేకి. ఈ గీతంలో కవి పేర్కొన్న దైవకార్యాలు, దైవగుణాలు మనం కూడ అనుభవానికి తెచ్చుకోవాలి.

112. సత్పురుషుని స్తవం

ఇది జ్ఞానకీర్తనం, కవి దీనిలో సత్పురుషుని స్తుతించాడు. దేవుని ఆజ్ఞలు పాటించి అతనిపట్ల భయభక్తులు చూపేవాడు సత్పురుషుడు. అతని బిడ్డలు వృద్ధిలోకి వస్తారు. అతనికి చీకటిలో గూడ వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని ఆజ్ఞలు పాటించని దుష్టులు నాశమౌతారు. సజ్జనుడు మాత్రం వృద్ధిలోకి వస్తాడు. అతడు ఎల్లవేళల మనకు ఆదర్శంగా వుంటాడు.

113. మహోన్నతుడూ కరుణామయుడూ

ఇది స్తుతిగీతం, దేవుని గొప్పతనాన్ని జాలినీ వర్ణిస్తుంది. ప్రభువు మహోన్నత స్థానంలో వసించేవాడు. ఐనా క్రిందికి వంగి భూమిమీది దీనులను గూడ పరికిస్తాడు. వారిని పట్టించుకొంటాడు. అతడు యోబుని బూడిద ప్రోవమీది నుండి పైకి లేపాడు. యోసేపని ఈజిప్టులో మంత్రిని చేసాడు. గొడ్రాలైన అన్నాకు బిడ్డల నిచ్చాడు. కనుక అతడు దీనబాంధవుడు. ఈ కీర్తన వర్ణించినట్లే క్రీస్తు కూడ దీనులను ఆదరించాడు. అతడు దీనజనప్రియుడు. నేడు మనం కూడ దీనులను నెనరుతో చూడాలి. అసలు మనం దీనుల వర్గానికి చెందివుండాలి. దీనజన సంరక్షకుడైన ప్రభువుని నిరంతరం కొనియాడాలి.

114. పాస్క తిరునాళ్ళ పాట

ఈ కీర్తనం యిస్రాయేలీయులు రెల్ల సముద్రాన్నీ యోర్గాను నదినీ దాటడాన్ని వర్ణిస్తుంది. భీకరుడైన ప్రభువు తన ప్రజలను నడిపించుకొని వస్తూండగా రెల్ల సముద్రం బయపడి పారిపోయింది.అలాగే యోర్దాను నది కూడ పారిపోయింది. చుట్టుపట్ల వున్న కొండలు పొట్టేళ్ళవలె దూకుతూ పారిపోయాయి. ఇవి కవి వాడిన ఉత్పేక్షలు. యిస్రాయేలీయులను నడిపించుకొని వచ్చిన ప్రభువు మహాశక్తిమంతుడు, అతడు ఎడారిలో కఠినశిల నుండి నీటిపాయలను పట్టి 0చాడు. యూదులు పాస్క తిరునాళ్ళలో ఈ పాటను పాడుకొనేవాళ్ళు నూత్న వేదంలో క్రీస్తు మనలను పాపదాస్యంనుండి విడిపించేవాడు. అతని వత్తానమే పాస్క కనుక నేడు మనం క్రీస్తుని స్తుతిస్తూ ఈ గీతాన్ని జపించవచ్చు