పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39. ఆయన పిశాచంచే శోధింపబడుతూ - మార్కు 1, 12

ప్రభువు శోధనలు పొందుతూ పిశాచాన్ని ఎదుర్కున్నాడు - మార్కు 1, 1213. అతడు వచ్చింది పాపాన్ని తొలగించేందుకు. పాపానికి అధికారి పిశాచం. కనుక ప్రభువు బహిరంగ జీవితారంభంలోనే పిశాచాన్ని ఎదుర్కొని జయింపవలసి వచ్చింది.

వ్యాధులను నయం చేయడం ద్వారా, దయ్యాలను వెళ్ళగొట్టడం ద్వారా క్రీస్తు పిశాచాన్ని జయించినట్లు నిరూపించాడు. యూదుల భావాలప్రకారం వ్యాధిబాధలు పిశాచాధికారాన్ని సూచిస్తాయి. కనుకనే ప్రభువు అద్భుతంగా వ్యాధులను మాన్సిపిశాచాన్ని కూలద్రోసాడు - 13,16. పక్షవాతరోగిని గుణపరచిన అద్భుతంలో రోగాన్ని నయంచేయడమూ పాపాన్ని పరిహరించడమూ, అనే రెండంశాలూ కన్పిస్తాయి - మార్కు 2, 10-11.

ఇక, దయ్యాలను వెళ్ళగొట్టడంద్వారా గూడ క్రీస్తు పిశాచాన్ని జయించినట్లు నిరూపితమైంది. కనుకనే యూదులు అతడు దయ్యాల సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతూన్నాడు గాబోలు అని అనుమానపడగా, క్రీస్తు "నేను దేవుని ఆత్మతోనే దయ్యాలను వెళ్ళగొడుతూన్నాను. కనుక దైవరాజ్యం సమీపించిందని నిశ్చితమైంది" అన్నాడు - మత్త 12, 28. ప్రభువు మన తరపున, మనకోసం, పిశాచాలను జయించాడు.

40, పిశాచం ఆకాశంనుండి మెరపులా పడిపోయింది - లూకా 10,18

మత్తయి 12, 29లో ఓ బలవంతుడు ఉండేవాడనీ, అంతకన్నా బలవంతుడొకడువచ్చి వాణ్ణి బంధించి వాడియిల్ల దోచుకొని పోయాడనీ చెప్పబడింది. ఈ తొలి బలవంతుడు పిశాచం. అతన్ని జయించి వాని యిల్ల కొల్లగొట్టిన మహాబలవంతుడు క్రీస్తు అందుకే శిష్యులు క్రీస్తుతో "దయ్యాలు కూడ నీ నామంమీదుగా మూకు లోబడ్డాయి" అని చెప్పగా అతడు "పిశాచం మెరపులాగ ఆకాశంనుండి జారిపడుతుండగా నేను చూచాను" అంటాడు - లూకా 10,18. ఈలా పిశాచం ప్రభువునకు ఓడిపోయింది. కనుక మనమిక ఈ పిశాచం శరణు పొందకూడదు.

41. చిన్న కుమారుడు తన యాస్తితో దూరదేశానికి వెళ్ళాడు - లూకా 15,13

బైబులు ప్రకారం పాపం చేయడమనగా తండ్రివంటి వాడైన దేవుని చెంతనుండి వెళ్ళిపోవడం, పశ్చాత్తాప పడడమనగా మళ్ళా ఆ దేవుని సన్నిధికి తిరిగిరావడం. దుడుకు చిన్నవాని సామెతలో ఈ సత్యం వ్యక్తమౌతూంది. అతడు తనవాటాను పంచుకొని తండ్రిని విడచి దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ దుర్వ్యసనాల్లో చిక్కి ఆస్తిని గోల్పోయి "వెతలనుభవించి బుద్ధితెచ్చుకొని తండ్రివద్దకు మరలివచ్చాడు. అలా వచ్చి తండ్రితో " నీకూ