పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాళ్లుకూడ నాశమైపోవాలని కోరుకొంటుంది. వారికి కలకాలం అపకీర్తి భీతి ప్రాప్తించాలని అభిలషిస్తుంది. ఈలా విరోధులమీద పగతీర్చుకోవడాన్ని నూత్నవేదం అంగీకరించదు. కనుక ఈ గీతాన్ని తిరుసభ ప్రార్థనలో చేర్చలేదు.

84. దేవాలయం మీద కోర్కె

   యిస్రాయేలీయులు భక్తితో ఉత్సాహంతో యెరూషలేము దేవళానికి యాత్ర చేసేవాళ్లు, యాత్రిక కీర్తనలు చాలా వున్నాయి. వాటిల్లో ఇదీ వొకటి. కీర్తనకారునికి దేవళాన్ని దర్శించాలనే ఉబలాటం మెండు. ఆ మందిరంలో వాసం చేసేవాళ్లంటే అతనికి మాలావు గౌరవం, మామూలు ఇండ్లల్లో వేయిదినాలు జీవించినదాని కంటె దేవళంలో ఒక్కరోజు గడిపింది మేలు. దుష్టులతో కలసి వారి యిండ్లల్లో వసించినదానికంటె దేవాలయ ద్వారం వద్ద పడివుండడం మెరుగు. మనం కూడా దేవాలయ భక్తిని అలవర్చుకోవాలి. దేవుణ్ణి దర్శించాలన్న ఆశతో దేవాలయానికి వెళ్లాలి. దేవుణ్ణి పూజించడం మహాభాగ్యమని ుంచాలి.

85. శాంతికొరకు ప్రార్ధనం

  ఇది ఉత్సాహ భావాలతో కూడిన కీర్తన, యూదులు బాబిలోనియా ప్రవాసం నుండి తిరిగి వచ్చాక చెప్పింది. ప్రవాసం నుండి తిరిగి వచ్చినవారికి ప్రభువు అనుగ్రహం వలన పాపక్షమ, శాంతి ప్రేమ లభించాలని కోరాడు కీర్తనకారుడు, ప్రభువు దయవల్ల ప్రజలు తిరిగివచ్చారు. వాళ్లు మల్లా పిచ్చిపనులకు పాల్పడకూడదు. దేశంలో ప్రభువు సాన్నిధ్యం నెలకొంటుంది, ప్రేమ, విశ్వసనీయత, న్యాయం రాజ్యాం చేస్తాయి. నేల చక్కగా పంటలు పండుతుంది. మనం భక్తితో జీవిస్తే చాలు, దేవుడు అన్ని వరాలు దయచేస్తాడు.

86. విపత్తులో ప్రార్ధన

ఈ కీర్తన చెప్పిన భక్తుడు ఏదో ఆపదలో వున్నాడు. కనుక అతడు ప్రభువుకి మొరపెట్టుకొన్నాడు. తన్ను కాపాడమని వేడుకొన్నాడు. ప్రభూ! నీ మార్గాలను నాకు బోధించు, నీ చిత్తాన్ని నాకు తెలియజేయి అని మనవి చేసాడు. నన్ను ఆదుకొని నాకు ఉపశాంతిని దయచేయి అని అడుగుకొన్నాడు. బాధల్లో వున్నపుడు మనమూ ఈలాగే ప్రార్థించాలి.

87. సియోను అన్నిజాతులకు తల్లి

ఇది యాత్రిక కీర్తన. సియోను లేక యెరూషలేము నగరమంటే యూదులకు అపారమైన భక్తి, ఆ సియోనును కీర్తించడానికి వ్రాసిన కీర్తన యిది. సియోను నగరం