పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80. యిస్రాయేలు ఉద్ధరణం కొరకు ప్రార్ధనం

   ఇది కూడ విలాప కీర్తనే. యూదులు బాబిలోనియులకు ఓడిపోయిన తర్వాత చెప్పింది. కీర్తనకారుడు యిప్రాయేలీయులను ద్రాక్లతీగతో పోల్చాడు, యావే ఈజిప్టు నుండి ఆ తీగను కొనివచ్చి కనాను దేశంలో నాటాడు. అది మూడు పూవులు ఆరుకాయలుగా వృద్ధి చెందింది. కాని అది మదంతో యావేను విడనాడింది. అన్యదైవాలను కొల్చింది. ప్రభువు కోపించి దాన్ని సర్వనాశం చేశాడు. ఈలా నాశమైన యిప్రాయేలీయులు బుద్ధితెచ్చుకొని పశ్చాత్తాపపడి ప్రభుని శరణువేడారు. దేవా నీవు మమ్మ ఉద్ధరించు. నీ ముఖకాంతిని మామీద ప్రకాశింపజేస్తే మేము మళ్లా రక్షణం పొందుతాం అని ప్రార్థించారు. ఆధ్యాత్మిక జీవితంలో మన చరిత్ర కూడ ఈలాగే వుంటుంది. దేవుని కరుణవల్ల భక్తితో జీవించినన్నాళ్లు మనం కూడ ద్రాక్షతీగలా ఎదుగుతాం. కాని పాపం చేసినప్పడు స్వీయనాశం తెచ్చుకొంటాం. ప్రభువు దయే మళ్లా మనలను ఉద్ధరించాలి. ఈ గీతం పశ్చాత్తాప ప్రార్థనలో వాడుకోదగింది.

81. గుడారాల పండుగకు గీతం

  ఇది యాత్రిక కీర్తనం. దేవళంలో గుడారాల పండుగ జరుగుతుంది. యాత్రికులు భక్తిభావంతో పాల్గొంటున్నారు. అప్పడు ఓ ప్రవక్త హఠాత్తుగా దైవప్రేరితుడై ఈ పాట చెప్పాడు. అతడు ప్రజలను హెచ్చరించాడు. పూర్వం పితరులు ప్రభువునుండి ఎన్నో వపకారాలు పొందినా వాటిని లక్ష్యం చేయకుండా అతనిపై తిరుగబడ్డారు. దాని ఫలితంగా దేవుని శిక్షను కొని తెచ్చాకొన్నారు. ఇప్పడు మనం కూడ దేవునిపై తిరుగబడకూడదు. అతని ఆజ్ఞలు మీరకూడదు. అతనికి విధేయులమై నడవాలి - ఇది ఆ ప్రవక్త హెచ్చరిక దేవునికి విధేయులమై యుండాలి అనేది బైబుల్లో మళ్లామల్లా వచ్చే అంశం. ఈ భాగ్యం కొరకు వేడుకొందాం.

82. అన్యాయపు న్యాయాధిపతులకు శిక్ష

  దేవుడు అన్యాయపు న్యాయాధిపతులకు శిక్ష విధిస్తాడని చెప్పాడు ఈ కీర్తనలో ప్రవక్త వాళ్లు దుష్టులకు పక్షపాతం చూపి పేదలకు అన్యాయం చేస్తే దేవుడు సహించడని నుడివాడు. న్యాయాధిపతులు గొప్పవాళ్లయినా అందరిలాగే వాళ్లుకూడ చస్తారు. కనుక వాళ్లు వళ్లు దగ్గర బెట్టకొని పనిచేయాలి. అధికారంలో వున్నవాళ్లు దుండగాలకు పూనుకోగూడదు.

83. శత్రుపరాజయానికి ప్రార్ధనం

ఈ కీర్తన దేవుడు శత్రువులను నిర్దయతో శిక్షించాలని కోరుకొంటుంది. వారి మీద శాపాలను కురిపిస్తుంది. ఎదోమీయులు, యిష్మాయేలీయులు మొదలైన దుషులవలె