పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చాడు. సర్వేశ్వరుడు చేసిన ఈ యద్భుత కార్యాలను తలంచుకొన్నపుడు కీర్తనకారునికి నిరాశపోయి విశ్వాసం పట్టంది. అతడు ప్రభువుని నమ్మిచిత్తశాంతిని పొందాడు. మనకు కూడ జీవితంలో నిరాశా నిస్పృహలు కలుగుతాయి. దేవునిమీద నమ్మకం పోతుంది. అపుడు సర్వేశ్వరుడు పూర్వం మనకు చేసిన ఉపకారాలను స్మరించుకోవాలి. అలా స్మరించుకొంటే దేవునిపట్ల మల్లా నమ్మకం చిగుర్చుతుంది.

{{center

78. యిస్రాయేలు చరిత్ర నేర్పే పాఠాలు

}}

    ఇది చారిత్రక కీర్తన. పూర్వం దేవుడు చేసిన మహాకార్యాలను యిప్రాయేలీయులకు తెలియజెప్పేది. యూదులు తమ పిల్లలకు కూడ ఈ పాటను విన్పించి వారికి తమ పూర్వ చరిత్రను తెలియజేసేవాళ్లు ఈలాంటి గీతాలద్వారా బాలబాలికలు చిన్ననాటినుండే యావేపట్ల భక్తిని పెంచుకొనేవాళ్లు, ప్రభువు యిప్రాయేలీయులను ఈజిప్టునుండి తోడ్కొని వచ్చాడు. సముద్రం గుండా నడిపించుకొని వచ్చాడు. ఎడారిలో వారికి అద్భుతంగా అన్నపానీయాలు దయచేసాడు. దారిలో వారి శత్రువులను మట్టపెట్టాడు. కడన వారిని వాగ్రత్త భూమికి చేర్చాడు. ఇన్ని వుపకారాలు చేసినా యూదులు తలబిరుసుతనంతో ఎప్పడూ దేవునిమీద తిరుగుబాటు చేసేవాళ్లు, అన్యదైవాలను పూజించేవాళ్లు, అందుకు శిక్షగా ప్రభువు వారిని బాబిలోనియా ప్రవాసానికి పంపాడు. విశేషంగా ఉత్తర రాష్ట్రంవాళ్లు యావేమీద తిరుగుబాటు చేసారు. కనుక ప్రభువు ఉత్తర తెగలను విడనాడి దక్షిణాన వున్న యూదా తెగను మాత్రమే తన ప్రజనుగా ఎన్నుకొన్నాడు. ఈ తెగకు యెరూషలేము కేంద్రమైంది. ఈ తెగలోనివాడే దావీదు. ఇతడు ప్రభువు ప్రత్యేకంగా ఎన్నుకొన్న భక్తుడు. ఈ దావీదు వంశంనుండే మెస్సీయా పుడతాడు. ఇది ఈ కీర్తన చెప్పే యూదుల చరిత్ర, నేడు మనకు కూడ వ్యక్తిగతమైన రక్షణ చరిత్ర వుంది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో తీరులో రక్షిస్తాడు. అతడు మనకు కావించిన రక్షణ కార్యాలను తలంచుకొని ప్రేరణం పొందుదాం.

79. జాతీయ విలాపం

 ఇది యిస్రాయేలీయులు బాబిలోనియులకు ఓడిపోయినప్పడు చెప్పిన

విలాపగీతం. శత్రువులు యెరూషలేమును నాశం చేసారు. దేవాలయాన్ని నేల మట్టం చేసారు. మీ దేవుడు ఏడీ? ఉంటే వచ్చి ఆదుకొనమనండి చూద్దాం అని యూదులను గేలిచేసారు. యూదులు దిగులుతో, పశ్చాత్తాప భావంతో ప్రభువుని ఆశ్రయించారు. ఆపదలో వున్నపుడు వారికి దేవుని అవసరం బాగా తెలియవచ్చింది. నేడు మనకు కూడ ఇంతే. సుఖాల్లో దేవుడు గుర్తుకిరాడు. కష్టాల్లో అతని అవసరం బాగా తెలుస్తుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలను భరించే శక్తికొరకు ప్రార్థిద్దాం.