పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నప్పటి నుండి నీవు నన్ను రక్షిస్తూవచ్చావని దేవునికి మొరపెట్టుకొన్నాడు. నేను జన్మించినప్పటి నుండి నేను నిన్ను ఆశ్రయిస్తు వచ్చానని దేవునికి మొరపెట్టుకొన్నాడు. నా బలం ఉడగిన తరుణంలో నీవు నన్ను చేయి విడువకు. ఇప్పడు నేను తలనరిసిన ముదుసలినై యుండగా నీవు నన్ను విడనాడవద్దు అని దీనంగా మొరపెట్టుకొన్నాడు. మనం ముసలివాళ్లం అయ్యే కొద్దీ శక్తి సన్నగిల్లిపోయి నిస్సహాయుల మౌతాం. ఆ తరుణంలో ప్రభువుని ఇంకా అధికంగా ఆశ్రయించాలి. నిస్సహాయులకు సహాయుడు అతడే.


72. కాబోయే రాజకొరకు ప్రార్ధనం

ఇది రాజకీర్తన. దావీదు వంశంలోపుట్టి రాజ్యానికి రానున్న ఓ నూత్న రాజును గూర్చి చెప్పినపాట. దావీదు వంశంలో రాజులు నూత్నంగా పరిపాలనం చేపట్టినపుడల్లా ప్రజల ఆశలు చిగురించేవి. వాళ్లు శాంతినీ నీతినీ ధర్మాన్నీ స్థాపిస్తారని ప్రజలు కలలు కనేవాళ్లు, ఆ రాజులు నీతియుక్తంగా పరిపాలిస్తారనీ, పేదలను న్యాయసమ్మతంగా ఏలుతారనీ ఆశించేవాళ్లు, కాని తరచుగా యిప్రాయేలీయుల ఆశలు అడియాసలయ్యేవి. ఆ రాజులు దుష్టులైపోయేవాళ్లు. ఐతే నీతి యుక్తంగాను శాంతియుతంగాను పరిపాలనంచేసే రాజు ఒకడున్నాడు. అతడే క్రీస్తు ఆ ప్రభువు మనలను సదా పరిపాలించాలని వేడుకొందాం.


73. న్యాయమే గెలుస్తుంది.


ఇది న్యాయ కీర్తనం, దీనిని చెప్పిన భక్తుడు గొప్ప ఆధ్యాత్మికమైన మార్పుని చెందాడు. అతడు మొదట దుర్మార్డులు వృద్ధిలోకి రావడం చూచి అసూయ చెందాడు. నేనుగూడ వాళ్లలాగ దుండగాలు చేసి సొమ్మ సంపాదించుకొంటే బాగుంటుంది కదా అనుకొన్నాడు. నే నొక్కణ్ణి విశుద్ధుణ్ణిగా జీవిస్తే మాత్రం లాభమేమిటి అనుకొన్నాడు. ఈలా ఆలోచిస్తుండగా ఓ దినం అతనికి దైవరహస్యం బోధపడింది. అది యిది. దుష్టుల అభివృద్ధి కొలది కాలం మాత్రమే నిలుస్తుంది. వాళ్న త్వరలోనే అడపాడ కానరాకుండపోతారు. దీనితో అతనికి జ్ఞానోదయం కలిగింది. అతడు ఆమీదట దుర్మార్డుల వృద్ధిని చూచి అసూయ పడలేదు. పరమభక్తిభావంతో ప్రభువుకి అంటిపెట్టుకొని వుండాలనుకొన్నాడు. దేవుని చెంత వుండడమే నాకు క్షేమకరం, నేను ప్రభువైన దేవుని ఆశ్రయించాను అని చెప్పకొన్నాడు. ప్రభువునుండి వైదొలగేవాడు చస్తాడు అనుకొన్నాడు భక్తితో పులకించిపోయి స్వర్గంలో నీవు దప్ప ఇంకెవరున్నారు? ఈ భూమి మీద నీవు దప్ప ఇంకొకంటి నాకు రుచించదు అని వాకొన్నాడు. ఈ భక్తుని చూచి మనంకూడ జ్ఞానం తెచ్చుకోవాలి. దుర్మార్గులు వృద్ధిలోకి వచ్చి సుఖభోగాలు అనుభవించినా మనం వాళ్లను అనుకరించ గూడదు. నిష్టతో ప్రభువుకి అంటిపెట్టకొని వండాలి.