పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనలను ఎల్లవేళల కరుణింపమని ఆ దయామయుని అడుగుకోవాలి, మా మీద కరుణ జూపి మమ్మ దీవించు. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనీయి అని అతన్ని అడుగుకోవాలి. ప్రభువు ఈ వరకే దయచేసిన పంటలకు అతనికి వందనాలు అర్పించాలి.


68. విజయగీతం


ప్రభువు సాధించిన విజయాలకు అతన్నిస్తుతించే కీర్తన యిది. ఈ పాటలో దేవుడు సీనాయినుండి విచ్చేసి సియోను కొండనెక్కి దేవాలయం ప్రవేశించినట్లుగా వర్ణించాడు కీర్తనకారుడు. అతడు అనాథులకు తండ్రి, వితంతువులకు ఆదరువు, అనగా కరుణ గల దేవుడు. అతడు దినదినమూ మన భారాన్ని మోస్తాడు. మనకు రక్షణాన్ని ప్రసాదిస్తాడు. కనుక అతనికి సదా స్తుతులు చెల్లిద్దాం.


69. జోకగీతం


ఇది విలాపగీతం, ఈ కీర్తనకారునికి వచ్చిన ఆపద యేమిటో మనకు తెలియదు. అది వ్యాధో పరనిందో శత్రుపీడనమో ఐయుంటుంది. అతనికి దేవాలయం పట్ల వున్న భక్లే అతనికి తిప్పలు తెచ్చిపెట్టింది. ఆ భక్తుడు తీవ్రబాధలు అనుభవిస్తున్నా అతనికి సానుభూతిగాని ఓదార్చుగాని లభించలేదు. కనుక అతడు నా మట్టకు నేను దీనుణ్ణి బాధామయుడ్డి అయ్యాను மூ) చెప్పకొన్నాడు. ప్రభూ! 8) రక్షణంతో నన్ను ఉద్ధరించు అని వేడుకొన్నాడు. కష్టాలు అందరికీ వస్తాయి. బాధల్లో అందరమూ క్రుంగిపోతాం. కనుక ఆపదల్లో ప్రభువు మనలను కాచి కాపాడాలని అడుగుకొందాం.


70. ఆర్తనాదం


ఈ కీర్తన చెప్పిన భక్తుడు ఏదో ఆపదలో ఉన్నాడు. కనుక అతడు ప్రభువు శీఘమే వచ్చి తనకు సాయం చేయాలని ప్రార్థించాడు. దేవుడు తన్నాదుకోవడానికి వస్తే తన శత్రువులు అవమానంతో తలదించుకొంటారని చెప్పాడు. ప్రభువు చెంతకు వచ్చి అతన్ని ఆశ్రయించేవాళ్లు పరమానందం చెందుతారని వాక్రుచ్చాడు. నేను దరిద్రుడ్డి, దీనుణ్ణి, శీఘమే వచ్చి నన్నాదుకో అవి మనవి చేసాడు. ఇతని లాగే మనం కూడ ఆపదరాగానే ప్రభువు సాయం అడుగుకొందాం.


71. వృదుని ప్రార్ధనం


ఇది విలాప గీతం. ఈ కీర్తన చెప్పినవాడు వృద్ధుడు. ఈ ముసలి భక్తుని విన్నపాలు మన హృదయాన్ని కదిలిస్తాయి. ముసలితనంలో దిక్మూమొక్కూ లేకుండా వున్నపుడు అతనికేదో ఆపదవచ్చింది. ఆ కీడునుండి తన్ను రక్షించమని అతడు ప్రభుని వేడుకొన్నాడు. 244