పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాటించినా, వారి హృదయంలో ప్రేమభావం లేకపోవడంచేత నిష్ఫలమే ఐంది. కనుక క్రీస్తు బోధల ప్రకారం పాపమూ పుణ్యమూ అనేవి కేవలం బాహ్యాచరణంలోగాదు, హృదయగత భావంలో వున్నాయి. పరిసయుల ప్రకారం హృదయగత భావంలోగాదు, బాహ్యాచరణంలో వున్నాయి. మనంకూడ చాలసార్లు యీ పరిసయుల్లాగే పొరపాటు పడుతున్నా మేమో విచారించి చూచుకుందాం.

37. పరిసయల నీతికంటె - మత్త 5,20

పరిసయల నీతికంటె మీ నీతి అధికంగాందే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అన్నాడు ప్రభువు శిష్యులతో - మత్త 5,20. ఏమిటి యీ నీతి? పరిసయల నీతి కేవలం బాహ్యాచరణం. శిష్యుల నీతి హృదయంలోని ప్రేమభావం. మొదటిది చాలదు. ఈ రెండవదికూడ అవసరం. క్రీస్తే మోషే ధర్మశాస్తాన్ని రద్దుచేయడానికి గాక, పరిపూర్ణం చేయడానికే వచ్చాడు - మత్త 5, 17. హృదయంలోని సద్భావంద్వారాగాని ధర్మశాస్తాచరణం పరిపూర్ణంకాదు - మత్త 7, 12. వెలుపలికి అన్ని చట్టాలూ అనుసరిస్తున్నా లోపలినుండి మాత్రం దుష్టాలోచనలు పుట్టక వస్తుంటే నరుడు పవిత్రుడు కాడు, అపవిత్రుడే ఔతాడు - మార్కు7, 21-23.

38. కునికిపాట్లపడే దీపాన్ని ఆర్పివేయడు - మత్త 12,20.

పాపాత్ములు నాశమై పోవాలనిగాదు, మనసు మార్చుకొని నా సముఖంలో బ్రతకాలని నా కోరిక అన్నాడు యావే ప్రభువు. తన తండ్రిలాగే క్రీస్తుకూడ పాపులను ఆదరంతో చూచాడు. "ఆమె అధికంగా ప్రేమించింది. కనుక ఆమె విస్తార పాపాలుకూడ క్షమింపబడ్డాయి" అన్నాడు, పాపాత్మురాలి నుద్దేశించి - లూకా 7,47. "నేడు ఈ యింటికి రక్షణం లభించిం"దన్నాడు, జక్కయనుద్దేశించి - లూకా 19,9 "తల్లీ యిక వెళ్ళి పాపం చేయకుండా బ్రతుకు" అన్నాడు మరో పాపాత్మురాలి నుద్దేశించి - యోహా 8,11. క్రీస్తు కరుణామయుడు. కనుకనే నాటికి 800 యేండ్లకు పూర్వమే యెషయా పల్కిన ప్రవచనాన్ని అతనికి అన్వయించారు సువార్తాకారులు. “అతడు నలిగిన రెల్లకాడను త్రుంచి వేయడు. కునికిపాట్లు పడుతూవున్న దీపాన్ని ఆర్చివేయడు." - మత్త 12,21. యెష 42, 13. ఇక్కడ నలిగిన రెల్లకాడ, కునికిపాట్లపడే దీపం పాపాత్ములకు ఉపమానాలు. మెస్సియాయైన క్రీస్తు ఈ కాడను త్రుంచివేయడు. ఈ దీపాన్ని ఆర్పివేయడు. అనగా పాపాత్ములను శిక్షించి నాశంచేయడు. ఆ రెల్లకాడ మళ్ళీ యెదిగేలా చూస్తాడు. ఆ దీపం మళ్ళా వెలిగేలా చూస్తాడు. అనగా పాపాత్ములు మళ్ళా బ్రతికేలా చూస్తాడు. పూర్వవేదప భగవంతుడుగాని నూతవేదప భగవంతుడుగాని పాపాన్ని గర్హిస్తాడే పాపిని గర్షించడు.