పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదర్శం సత్పురుషుడుకాని దుర్మార్ణుడు కాదు. మనం ప్రభువమీద భారంవేసి అతన్ని నమ్మితే అతడు మన కార్యాలన్నీ నెరవేరుస్తాడు.

38. బాధల్లో ప్రార్ధనం

ఇది విలాపగీతం. దీన్ని వ్రాసిన భక్తుడు ఫరోరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతని గుండె దడదడ కొట్టుకొంటూంది. సత్తువ ఉడిగిపోయింది. కండ్లల్లో కాంతి అంతరించింది. స్వీయ పాపాలవలననే తాను ఈ వ్యాధికి చిక్మాననికూడ అతనికి తోచింది. ఇరుగుపొరుగువాళ్లు కూడ అతని వ్యాధికి విపరీతార్థాలు కల్పించి గేలిచేసారు. ఈలాంటి పరిస్థితుల్లో ఆ పుణ్యశీలుడు దేవునికి మొరపెట్టాడు. తన తప్పిదాలను క్షమించి ఆరోగ్యదానం దయచేయమని వేడుకొన్నాడు. ఈ సజ్జనునిలాగే మనం కూడ వ్యాధిబాధలకు గురౌతాం. కష్టాలవాత పడతాం. అప్పుడు ఆ ప్రభువుకి ప్రార్థన చేసికోవాలి, "నా రక్షకుడవైన ప్రభూ! నీవు నన్ను ఆదుకోవడానికి శీఘమే విచ్చేయి" అని మనవి చేసికోవాలి.

39. నరుని అల్పత్వం

ఈ కీర్తన వ్రాసిన రచయిత తీవ్రవ్యాధితో బాధపడుతూన్నాడు. అతడు తన్ను శ్రమలపాలు చేసిన దేవుని మంచితనాన్ని గూర్చి ప్రశ్నించాలనుకొన్నాడు. కాని తన ఫిర్యాదులు విని దుషులు దేవుని పట్ల పూర్తిగా భక్తి కోల్పోతారేమోనని దడిసి మౌనంగా వుండిపోయాడు. పాపం అతని బాధ మిక్కుటమైంది. అతనికి నరజీవితం స్వల్పకాలికమైంది అన్పించింది. జీవితంలో ఈ యార్బాటమంతా ఎందుకా అనిపించింది. ఈలాంటి నిర్వేదంతో అతడు తన్ను ఆదుకొమ్మని ప్రభువుకి మనవిచేసాడు. ఒకోసారి మనంకూడ దేవునిమీద తప్పబట్టపోతాం. ఈ లోకంలో మనకెదురయ్యే కష్టాలను భరించలేక దేవుడు మనకేదో ద్రోహంచేసాడని వాపోతాం. ఈలాంటి మనస్తత్వానికి గురికాకుండావుండే భాగ్యాన్ని దయచేయమని ఆ ప్రభువునే అడుగుకొందాం.

40. దైవస్తుతి, మనవి

ఈ కీర్తనలో రెండు భాగాలున్నాయి. మొదటి భాగంలో రచయిత ప్రభువుకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు. రెండవభాగం విలాప కీర్తన, ఈ భాగంలో అతడు ଠେଁ తన తప్పిదాలను మన్నించి తన ఆపదలను తొలగించాలని వేడుకొన్నాడు. ఆ రోజుల్లో అందరూ దేవళంలో జంతుబలులు అర్పించేవాళ్లు, ఈ బలులవల్ల ప్రభువు వరప్రసాదాన్ని పొందుతామని నమ్మేవాళ్ళు, కాని ఈ యాచారం ఈ కీర్తనకారునికి నచ్చలేదు. అతడు పశుబలులు సమర్పించడంకంటె దేవుని చిత్తాన్ని పాటించడం మేలు అని చెప్పాడు. దేవుని ఆజ్ఞలప్రకారం జీవించడం శ్రేయస్కరమని వాకొన్నాడు. ఎందుకంటే ఆరాధనం