పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు ఎంత మంచివాడో మీకే తెలుస్తుంది అన్నాడు. భగవంతుని మంచితనాన్ని అనుభవానికి తెచ్చుకొన్నవాడు అతన్ని ప్రేమించకుండా వుండలేడు. అతన్ని పదిమందికి చాటిచెప్పకుండా వుండలేడు. ఈ భక్తునిలాగే మనంకూడ ప్రభువు కృపను అనుభవానికి తెచ్చుకోవాలి. అతనిమీద భారంవేసి జీవించాలి.

35. కష్టాల్లో వేడికోలు

ఈ కీర్తన చెప్పిన కవికి శత్రువుల బాధ మిక్కుటమైంది. కనుక ఆ దుర్మారులు పెట్టే బాధలనుండి తన్ను రక్షింపమని ప్రభుని వేడుకొన్నాడు. ఆ శత్రువులు పూర్వం అతనినుండి ఉపకారాలు పొందారు. ఐనా ఇప్పడు అతన్ని బాధిస్తున్నారు. కనుక అతని వేదన ఇంకా యొక్కువైంది. ఈ తీవ్రవేదనతోనే అతడు ప్రభుని తనకు సాయం చేయమని వేడుకొన్నాడు. శీప్రుమే వచ్చి తన్ను కాపాడమని మొరపెట్టుకొన్నాడు. ఈలాంటి సంఘటనలు మన జీవితంలోకూడ అప్పడప్పడు పొడచూపుతుంటాయి. అప్పడు మనంకూడ ప్రభూ! నీవు నాకు న్యాయం చెప్ప. నా పక్షాన వాదించు అని వేడుకోవాలి.

36. పాపి దుష్టత్వం, దేవుని మంచితనం

ఈ గీతాన్ని చెప్పిన భక్తుడు పాపి దుష్టత్వాన్ని తలంచుకొని విలాపగీతం వ్రాసాడు. పాపం అతని హృదయంలో మంత్రాలోచన చేస్తూంటుంది. పాపి దేవుణ్ణి లెక్కచేయక దుష్కార్యాలు చేస్తాడు. ఐనా ప్రభువు మంచివాడు. అతడు పాపాన్ని క్రమేణ అణచివేస్తాడు. దుష్టులకుగూడ మంచిబుద్ధిని దయచేస్తాడు. మంచివాళ్ళను ఇంకా అధికంగా ఆదరిస్తాడు. ఎల్లరికీ తన కృపను ప్రేమను దయచేస్తాడు, కట్టకడన నరుల దుష్టత్వం అంతరిస్తుంది. దేవుని మంచితనం మాత్రమే మహాపర్వతాల్లాగ స్థిరంగా నిలుస్తుంది. లోకంలో చెడుగు మంచిని జయించలేదు. ఈ గీతాన్ని చెప్పిన పుణ్యశీలునితోపాటు మనం కూడ ప్రభువుతో "నీవు జీవపు చెలమవు, నీ వెలుగు వలననే మేమూ వెలుగు చూస్తాం" అని చెప్పకోవాలి.

37.సజ్జనుల గతి

దుషుడు వృద్ధిలోకి వస్తున్నారెందుకా అని యిస్రాయేలీయులు చాలమంది విస్తుపోయేవాళ్ళు వాళ్ళపట్ల అసహనం చూపేవాళ్ళ ప్రభువు వాళ్ళను శీఘమే అణచివేయాలని కోరుకొనేవాళ్లు. ఈ కీర్తనం చెప్పిన భక్తుడు దుర్మార్డుల అభివృద్ధిని చూచి వికలమనస్కులు కావద్దనీ, కోపం తెచ్చుకోవద్దనీ హెచ్చరించాడు. దుష్టుల విజయం తాత్కాలికమైంది. వాళ్ళ మహా వృక్షంలా ఎదిగినా పెల్లగిల్లి పడిపోతారు. ఒకసారి పడిపోతే మల్లా లేవరు. దేవుని ఆజ్ఞలు పాటించే సత్పురుషుడు మాత్రం స్థిరంగా నిలుస్తాడు. వెలుగులా ప్రకాశిస్తాడు. అతని బిడ్డలకు అడుక్కొని తినే గతి పట్టదు. కనుక మనకు