పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31. ఆపదలో ప్రార్ధన

ఇది విలాపగీతం. ఆపదలో వున్న భక్తుడు తన వేదనలను భగవంతునికి నివేదించుకొన్నాడు. నరులు తన్ను చచ్చినవాడ్డి మర్చిపోయినట్లుగా మర్చిపోయారు. పనికిరాని వస్తువునులాగ మూలన పడవేసారు. కనుక అతనికి దుఃఖం కలిగింది. అతడు తన్ను కాపాడమని ప్రభువుని వేడుకొన్నాడు. దేవుడు మంచివాడు కనుక అతని ఆర్తిని తొలగించాడు. ఆ పుణ్యశీలుడు దేవునికి వందనాలు అర్పించాడు. ఆ పుణ్యాత్మునిలాగే మనం కూడ కష్టాల్లో ప్రభుని శరణు వేడాలి. ప్రభూ! నన్ను నేను నీ చేతుల్లోనికి అర్పించుకొంటున్నాను అని చెప్పాలి.

32. పాపాన్ని ఒప్పకోవడం

పాపం వ్యాధిని తెచ్చిపెడుతుందనీ, పాపపరిహారం వలన వ్యాధి తొలగిపోతుందనీ యిప్రాయేలు ప్రజల నమ్మకం. ఈ కీర్తన చెప్పిన కవి వ్యాధి వాతబట్టాడు. అతడు వినయంతో దేవుని యెదుట తన పాపాన్ని ఒప్పకొన్నాడు. దానితో అతనిరోగం తొలగిపోయింది. స్వీయానుభవంతో అతడు భావితరాలవారికి ఉపదేశం చేసాడు. పాపం చేయవద్దనీ, పాపం చేసిన దుపులు పెక్కువేదనలు అనుభవిస్తారనీ హెచ్చరించాడు. పాప భారంవలన క్రుంగిపోయినపుడు మనంకూడ ఈ ధర్మవర్తనుని లాగే నేను దేవుని యెదుట నా పాపాలను వొప్పకొంటాను, నా అపరాధాలను దాచను అని చెప్పకోవాలి. పాపభారం వదలించుకొన్నవాడు ఉల్లాసంచెంది ఆనందిస్తాడు.

33. సృష్టికర్త

ఈ కీర్తన కృతజ్ఞతాస్తుతి. ప్రభువు తనకు ఏదో ఉపకారం చేసినందులకు ఈ స్తోత్రకారుడు అతనికి వందనాలు అర్పిస్తున్నాడు. ప్రభువు సృష్టికర్త, అతని వాక్కు కూడ చేసేదే. అతడు ఒక్క పలుకు పలకగానే లోకం పుట్టింది. దేవుడు కలిగించిన యీ లోకంలో అతని సాన్నిధ్యం నెలకొని ఉంటుంది. ఈ లోకమంతా అతని ప్రేమతో నిండివుంది. ఈ పుణ్యశీలుని లాగే మనం కూడ దేవునినుండి ఉపకారం పొందినవాళ్ళం. కనుక మన తరపున మనంకూడ అతన్ని స్తుతించి కీర్తించాలి. ప్రభూ! మేము నిన్ను విశ్వసించినట్లే, నీ కరుణకూడ సదా మమ్మ ఆవరించి వుండునుగాక అని చెప్పకోవాలి.

34. దేవుని మంచితనం

ఇదికూడ కృతజ్ఞతాస్తుతే తనకు ఏదో ఉపకారం చేసినందులకు భక్తుడు దేవళంలో ప్రభువుని స్తుతించాడు. అచటి భక్తులకు ఉపదేశంకూడ చేసాడు. మీరే పరిశీలించి చూడండి.