పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విడనాడినా ప్రభువమాత్రం తన్నుచేరదీస్తాడని విశ్వసించాడు. అతడు భవిష్యత్తులో తనకేదైన కీడు కలగవచ్చునని భయపడ్డాడు. కనుక తన్ను సురక్షితమైన మార్గంలో నడిపించమని దేవుణ్ణి వేడుకొన్నాడు. ఈ భక్తునిలాగే మనం కూడ ప్రభూ! నీ దివ్యముఖాన్ని నానుండి దాచుకోవద్దు అని వేడుకోవాలి. ప్రభువేనాకు కోట, ఇక నేనెవరికీ భయపడను అని చెప్పకోవాలి.

28. మనవి, కృతజ్ఞత

ఇది విలాప కీర్తనం. భక్తునికి శత్రువుల వలన ఏదో కష్టం వచ్చింది. వాళ్ళ బయటికి స్నేహం ఉట్టిపడినట్లుగా మాట్లాడుతున్నారు. వారి హృదయంలో మాత్రం దుష్టత్వం గూడుగట్టుకొని వుంది. భక్తుడు ఆ దుర్గార్డులకు దడిసి ప్రభువుని శరణువేడాడు. దేవుడు అతనికి సాయం చేసాడు. అతన్ని ఆపదలోనుండి ఒడ్డుకి జేర్చాడు. కనుక కీర్తనకారుడు ప్రభువుకి వందనాలు చెప్పాడు, ప్రభువే నాకు బలం, డాలు అని పాడాడు. మనంకూడ ఇబ్బందుల్లో మనకు రక్షణదుర్గమైన ప్రభువుని ఆశ్రయించాలి.

29. తుఫానులో దేవుడు

ఈ కీర్తన యిస్రాయేలు దేశంలో సంభవించిన ఓ పెద్ద తుఫానును వర్ణిస్తుంది. ఆ తుఫానులోమెరపులూ పిడుగులూ చూపట్టాయి. ప్రజలందరూ భీతిజెందారు. ప్రభువు కలిగించిన తుఫాను అతని అనంత శక్తినీ మహిమనీ వెల్లడి చేసింది. ప్రకృతి బీభత్సంలో ఆ ప్రభువు దర్శనమిచ్చాడు. అతడు భయంకరుడు. ఐనా తన ప్రజలను శాంతి సమాధానాలతో కాచికాపాడేవాడు. ఈ కవిలాగే మనం కూడ ప్రకృతి శక్తుల్లో భగవంతుని హస్తాన్ని దర్శించాలి.

30. ఆపద తప్పగా కృతజ్ఞతాస్తుతి

ఈ పాట కట్టిన రచయిత వ్యాధివాతబడి మృత్యువు కోరల్లో చిక్కుకొన్నాడు. ఐనా అతడు నమ్మకంతో దేవునికి ప్రార్ధన చేసాడు. ప్రభువు అతన్ని మృత్యుపాశాల నుండి విడిపించాడు. కనుక కవి నీవు నా శోకాన్ని నాట్యంగా మార్చావు. నేను తాల్చిన గోనెను తొలగించి నాకు ఆనందకరమైన బట్టలు కట్టబెట్టావు అని చెప్పకొన్నాడు. భగవంతుడు. తన దాసులమీద క్షణకాలం 5*ඩ්බ්දක. అతని అనుగ్రహం మాత్రం జీవితాంతం వుంటుంది. ఈ పుణ్యచరితునిలాగే మనం కూడ చాలసార్లు వ్యాధిబాధల నుండి బయటపడ్డాం. కనుక మనం కూడ "ప్రభువైన దేవా! నేను నీకు వందనాలు అర్పిస్తాను అని చెప్పకోవాలి.