పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34. మీరు మారుమనస్సు పొందండి - మత్త 4, 17.

ఇంతవరకు పాపాన్నిగూర్చి పూర్వవేదం ఏం బోధిస్తుందో చూచాం, ఇక నూత్న వేదం ఏం బోధిస్తుందో పరిశీలిద్దాం. "పరలోక రాజ్యం మీ సమీపంలో వుంది కనుక మారుమనస్సు పొందండి" అంటూ క్రీస్తు బహిరంగ జీవితం ఆరంభించారు - మత్త 4.17. మారుమనస్సు పొందడం దేనికి? పరలోకరాజ్యంకోసం, క్రీస్తే, అతడనుగ్రహించే రక్షణమే, ఈ పరలోకరాజ్యం. ఈ రక్షణం దేనినుండి? పాపాన్నుండి. క్రీస్తు సొంత పేరైన "యేసు" శబ్దానికిగూడ నరులను పాపాన్నుండి రక్షించేవాడనే అర్థం - మత్త 1.21. హీబ్రూభాషలోని 'యెహోషువా" శబ్దానికీ గ్రీకుభాషలోని "యేసుస్" శబ్దానికీ ప్రభువు రక్షిస్తాడనే యర్థం. యీ శబ్దాలే మన భాషలో యేసు (జేసు) రూపాలు పొందాయి. పాపం ద్వారా నరుడు తండ్రియైన దేవుని చెంత నుండి వెళ్ళిపోతాడు. అతడు మళ్ళా తండ్రివద్దకు తిరగివస్తేనేగాని పాపపరిహారం లేదు. ఈలా తిరిగి రావాలంటే పాపి మనస్సు మార్చుకోవాలి. దీన్నే మారుమనస్సు పొందడం లేక పరివర్తనం చెందడం అంటాం. ఈ తిరిగి రావడమనే భావాన్ని"మీరు గొర్రెలవలె దారి తప్పిపోయితిరి. కాని యిప్పడు మీ యాత్మల కాపరి వద్దకు తిరిగవచ్చితిరి" అనే వాక్యంలో చూడవచ్చు - 1 పేతురు 2,25.

35. వ్యాధిగ్రస్తుల కోసంగాని ఆరోగ్యవంతులకోసం గాదు - మార్కు 2, 17.

ఏసు నరుల పాపాలను భరించడానికై వచ్చిన బాధామయ సేవకుడు. అతడు వచ్చింది పాపాత్ములకోసంగాని నీతిమంతులకోసం గాదు. ప్రవక్తల్లాగా, స్నాపక యోహానులాగ యేసు కూడ హృదయం మార్చుకొని పరివర్తనం చెందండని బోధించాడు. నరుడు యీలా హృదయం మార్చుకున్నట్లయితే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడౌతాడు - మార్కు 1,15.

36. నరుడ్డి అపవిత్రుణ్ణి చేసేది హృదయంలోని దురాలోచనలే - మార్కు7,20

పాపాన్ని గూర్చిన క్రీస్తు భావాలను నాటి పరిసయుల భావాలతో పోల్చిచూడ్డం గూడ అవసరం. పరిసయులు బాహ్యంగా మోషేధర్మశాస్రాన్ని అనుసరిస్తే סנסeטג అనుకున్నారు. కాని ఏలాంటి హృదయ భావాలతో యీ ధర్మశాస్తాన్ని అనుసరించాలో వాళ్ళ గమనింపలేదు. కాని క్రీస్తు బాహ్యాచరణం కంటె హృదయంలోని భావాలు ముఖ్యమన్నాడు మార్కు 7, 20-23. బాహ్యాచరణానికి విలువ నిచ్చేది విశేషంగా హృదయంలోని ప్రేమభావం - యోహా 15,12. క్రీస్తు సబ్బతును ఆచరించడంలేదని పరిసయులు గొణుగుకున్నారు, పెద్దల పారంపర్యాచారాలు పాటించడం లేదని సణుగుకున్నారు - మార్కు - 7, 2-5. కాని యూదులు యీ యాచారాలన్నిటినీ