పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రవేశించడానికి ఏమి యర్హతలు కావాలని యాజకులను ప్రశ్నించారు. యాజకులు ఆ యర్హతలను వివరించి చెప్పారు. ఆ పిమ్మట భక్తులు మందసాన్ని దేవళంలోనికి కొని తెచ్చారు. ప్రభువ మందసం మీద ఆసీనుడై మహారాజులాగా దేవళంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక దేవాలయపు తలుపులు తెరచుకోవాలని ఆజ్ఞాపించారు. యాజకులు ఆ ప్రభువు ఎవరని ప్రశ్నింపగా భక్తులు అతడు సైన్యాలకు అధిపతియైన ప్రభువని వాకొన్నారు. దానితో అతడు యావే ప్రభువని తెలిసిపోయింది. ఈలా ఈ కీర్తన అంతాగూడ నాటకీయ శైలిలో నడిచింది. సైన్యాలకు అధిపతీ, మహిమాన్వితుడూ ఐన ప్రభువుని మనం కూడ స్తుతించి కీర్తించాలి.


25. ఆపదలో ప్రార్ధన

ఇది విలాపగీతం. ఈ పాటను కట్టిన భక్తుడు ఇక్కట్టల్లో వున్నాడు. తాను పూర్వం జేసిన పాపాలే తనకు శ్రమలు తెచ్చి పెట్టాయనిగూడ భావించాడు. కనుక అతడు ప్రభువుకి ప్రార్థన చేసాడు. తన పాపాలను మన్నించి శ్రమలను తొలగించమని వేడుకొన్నాడు. తాను యావనంలో తెలిసీతెలియక చేసిన పాపాలను క్షమించమని అడుగుకొన్నాడు. ఇంతవరకు నీవు నాపట్ల చూపుతూ వచ్చిన కరుణను విస్మరించవద్దని వేడుకొన్నాడు. ఈ పుణ్యాత్మునిలాగే మనకుకూడ ఆపదలు వస్తాయి. అప్పడు మనంకూడ వినయంతో ప్రభువుకి ప్రార్థన చేసికోవాలి. దేవా! నేను నిన్ను నమ్మాను అని చెప్పకోవాలి.

26. నిర్దోషి ప్రార్ధనం

ఇది కూడ విలాపగీతం. ఈ పాటను కట్టిన కవి ఇక్కట్టుల్లో వుండి ప్రభువు సహాయం అడుగుకోవడానికి దేవళానికి వచ్చాడు. తాను నిర్దోషిననీ తన ఆపదను తొలగించమనీ ప్రభువుని అడుగుకొన్నాడు. తన నిష్కల్మషత్వాన్ని నిరూపించుకోవడానికి దేవళంలో చేతులు కడుగుకొన్నాడు. దేవుణ్ణిస్తుతిస్తూ బలిపీఠంచుటూప్రదక్షిణం చేసాడు. ప్రభువు వసించే దేవళమంటే అతనికి ఎంతో యిష్టం, ఎంతో గౌరవం. ఈ భక్తునిలాగే మనం కూడ ఆపదలో ప్రభుని శరణువేడాలి. అతని దేవళానికి వెళ్లాలి. దేవా నీవు నన్ను కరుణతోజూడు అని అడుగుకోవాలి.

27. దేవుని అండదండలు

ఇది నమ్మకాన్నితెలియజేసే కీర్తన. ఏదో కష్టంవచ్చి భక్తుడు ప్రభువు దేవళంలోకి వచ్చాడు. దేవుని పట్ల తనకున్న నమ్మకాన్ని ఆ ప్రభువు ముందట వెల్లడి చేసికొన్నాడు. . ప్రభువే తనకు దీపం, కోట అని చెప్పకొన్నాడు. తాను బ్రతికినన్నాళ్ళు ప్రభువు మందిరంలోనే వసించాలని తన కోరిక అని నుడివాడు. సొంత తల్లిదండ్రులు తన్ను