పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొరకు ప్రార్ధించినట్లే నేడు మనం తిరుసభ నాయకుల కొరకు ప్రార్థించాలి. పోపుగారు బిషప్పలు గురువులు మాటకన్యాలు ఉపదేశులు మొదలైన నాయకులను దేవుడు దీవించాలని వేడుకోవాలి.

21. రాజు విజయానికి కృతజ్ఞత

ఇది కూడ రాజకీర్తనం. దేవుడు రాజకి యుద్ధంలో విజయం దయచేసినందుకు అతనికి కృతజ్ఞతాస్తుతిగా పాడిన పాట. ఈ స్తుతిని గాయకులు దేవాలయంలో పాడి విన్పించారు. మన కష్టాల్లో ప్రభువు మనలను చేయివిడువడు. భక్తులు దైవబలాన్నీ దైవసహాయాన్నీ నిరంతరం గానంచేయాలి.

22. పుణ్యాత్ముని శ్రమలు

ఇది విలాప కీర్తనం. ఈ కీర్తనను కట్టిన భక్తుడు శత్రుపీడనానికీ బాధకూ అవమానానికీ గురయ్యాడు. దేవునికి దీనంగా మొరపెట్టుకొన్నాడు. నేను ఆపదలోవున్నాను. నీవు నాకు దూరంగా ఉండవదు. నన్ను ఆదుకొనేవా డెవడూలేడు అని వేడుకొన్నాడు. ప్రభువు అతని మొర విని అతన్ని కాపాడాడు. కనుక భక్తుడు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు. క్రీస్తు సిలువమీద చనిపోతూ ఈ కీర్తనను జపించాడు. నూతవేద రచయితలు ఈ గీతాన్ని క్రీస్తు శ్రమలకు అన్వయించి చూపించారు. మన కష్టాల్లో మనంకూడ నాదేవా! నాదేవా! నన్నేల చేయి విడిచావని జపించాలి.

23. మంచికాపరి

ఇది దేవునిపట్ల నమ్మకాన్ని వెల్లడిజేసే కీర్తన. దీనిలో రెండు భాగాలున్నాయి. మొదటి భాగంలో భక్తుడు భగవంతుణ్ణి గొర్రెల కాపరితోను తన్నుగొర్రెతోను పోల్చుకొన్నాడు. దేవుడంతటి కాపరి కాపాడుతూంటాడు గనుక తనకే భయమూ లేదని చెప్పకొన్నాడు. රිරක්කී ආ"rරථඒ* భగవంతుణ్ణి ఆతిథేయునితోను తన్ను అతిథితోను పోల్చుకొన్నాడు. దేవళంలో ప్రభువే తనకు అన్నపానీయాలు దయచేస్తాడని చెప్పకొన్నాడు. ఇది బైబుల్లోని గొప్ప కీర్తనల్లో వొకటి. భగవంతుణ్ణి బాగా అనుభవానికి తెచ్చుకొన్న భక్తుడు చెప్పినపాట. అతనిలాగే మనంకూడ ప్రభువేనాకు కాపరి, ఇక యే కొదవా లేదు అని చెప్పకోవాలి. ప్రభువుని పూర్ణంగా విశ్వసించాలి.

24. ప్రభువు దేవాలయ ప్రవేశం

ఈ కీర్తనలో భక్తులు మందసంతో దేవాలయం చుటూ ప్రదక్షిణం చేసారు. సృష్టికర్తయైన దేవుని స్తుతించారు. వాళ్ళ దేవాలయ ద్వారం దగ్గరికి వచ్చి దైవమందిరంలో

230