పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మానివేసారు. మంచి కార్యాలకు మారుగా దుష్కార్యాలు చేస్తున్నారు. పేదసాదలకు కీడుజేసి వారిని భోజనంలా బ్రిమింగేస్తున్నారు. కాని ప్రభువు వారిని శిక్షించి తీరతాడు. వాళ్ళ భయంవాతపడతారు. కడన రచయిత యిప్రాయేలు ప్రజల కొరకు ప్రార్ధనంచేసి కీర్తనను ముగించాడు. మనం కూడ కొన్ని సారులు దేవుడు లేడో అన్నట్లుగా ప్రవర్తించి దుష్టకార్యాలకు పూనుకొంటాం. పేదసాదలను పీడించి భోజనంలా మ్రింగివేస్తాం. కాని ఈలా చేయకూడదు.

15. యావే మందిరంలో అతిథి

ఇది యాత్రిక కీర్తన. కొందరు యాత్రికులు యెరూషలేము దేవాలయానికి వచ్చారు. దేవళంలో ప్రవేశించి అక్కడజరగబోయే దైవారాధనలో పాల్గొనాలంటే ఏలాంటి అర్హతలుండాలని దేవాలయ యాజకుణ్ణి అడిగారు. అతడు దేవళంలో ప్రవేశించడానికి ఉండవలసిన యోగ్యతలను వివరించి చెప్పాడు. దైవభక్తి వుండాలి. తోడివారికి కీడు చేయకూడదు. అబద్ధమాడకూడదు. లంచాలు వడ్డీలు పుచ్చుకోగూడదు. ఈ కీర్తన పేర్కొనే నియమాలను జాగ్రత్తగా మననంజేసికొంటే నేడు మనకుగూడ భక్తి పడుతుంది. అప్పడు మన ప్రవర్తనను చక్కదిద్దుకొని అవసరమైన మార్పులు చేసికొంటాం.

16. ప్రభువే నాకు వారసభూమి

ఈ కీర్తన చెప్పిన భక్తుడు లేవీయుడు. దేవళంలో పరిచారకుడు. పూర్వం యోషువా 11గోత్రాల ప్రజలకు వగ్దత్త భూమిని పంచియిచ్చాడు. లేవీ గోత్రానికి మాత్రం భూమిని ఈయలేదు. ప్రభువే మీకు వారసభూమి ఔతాడని చెప్పాడు. అనగా వాళ్లు దేవళంలో ప్రభువుని సేవించి అక్కడ భక్తులు సమర్పించే కానుకలు ఆరగించి బ్రతకాలి. ఈ భావాన్ని మనసులో పెట్టుకొనే కీర్తనకారుడు ఈ పాట వ్రాసాడు. ప్రభువే నాకు వారసభూమి, పానపాత్రం అని వాకొన్నాడు. అనగా అతనికి అన్నపానీయాలు కూడ ప్రభువే అని భావం. అన్యులు పరదైవాలను కొల్చినా తాను మాత్రం యావేను మాత్రమే సేవిస్తాడు. ప్రభువు నిరంతరం అతని కన్నుల యెదుట మసలుతూంటాడు. రాత్రిలో నిద్రించేపడుకూడ అతడు దైవసాన్నిధ్యాన్ని విస్మరింపడు. ఇది చాల భక్తిగల కీర్తన.ఈ భక్తునితోపాటు మనంకూడ ప్రభువే నాకు వారసభూమి, నా యాస్తి అని చెప్పకొంటే ఎంత బాగుంటుంది!

17. నిర్దోషి ప్రార్ధనం

ఇది విలాప కీర్తనం. కీర్తనకారునికి ఏదో ఆపదవచ్చింది. దీనిలో దుషుల హస్తంకూడ వుంది. అతడు ప్రభువు నెదుట తన బాధను సవిస్తరంగా తెలియజేసికొన్నాడు. తాను నిర్దోషినని ప్రమాణం చేసాడు. తన్ను హింసించే శత్రువులను శిక్షించమని