పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11. దేవునిపట్ల నమ్మకం

లోకంలో దుష్టత్వం ప్రబలిపోయింది. దుర్మార్డుల దుష్కార్యాల వలన కీర్తనకారునికి గూడ ప్రమాదం కలిగింది. స్నేహితులు నీవు ఇంటినుండి పారిపొమ్మని సలహాయిచ్చారు. కాని అతడు ఆలా పారిపోలేదు. దుర్మార్గులనూ వారి దుష్క్రిఅయలనూ అణచివేసే ప్రభువు ఒకడున్నాడని నమ్మి ధైర్యంగా వుండిపోయాడు. ఈ భక్తునిలాగే మనం కూడ కష్టాల్లో ప్రభుని శరణువేడాలి. అతని సహాయం కొరకు ఓపికతో వేచివుండాలి.

12. దుష్టుల నుండి రక్షణం కొరకు ప్రార్ధనం

ఈ కీర్తన కట్టిన కవికి తన నాటి సమాజంలో ప్రజల పోకడలు నచ్చలేదు. వారివన్ని ఇచ్చకాలు, అబద్దాలు. వారి ప్రవర్తనం వల్ల అతనికి శ్రమకూడ కలిగింది. కనుక, అతడు దేవళంలోకి వెళ్ళి ప్రభువుకి మొరపెట్టుకొన్నాడు. అక్కడ ప్రవక్త ప్రభువు పేరిట ప్రవచనం చెప్పాడు. “పీడితులను ఆదుకోవటానికీ, ఆర్తిలో వున్నవారికి సహాయం చేయడానికీ నేను శఘ్రమే వస్తాను. నా వలన నీకు భద్రత కలుగుతుంది" అని పలికాడు. ఆ పలుకులకు కీర్తన కారుడు ఊరట చెందాడు. ప్రభువు వాక్కుపుటం వేసిన వెండిలాగా శ్రేష్టమైందని నమ్మాడు. శ్రమలు మనలను పీడించినపుడు మనం కూడ ఈ రచయితలాగే ప్రభువుని వేడుకోవాలి. అప్పుడు అతడు "నేను శీఘ్రమే వస్తాను, నా భక్తులకు భద్రతను దయచేస్తాను" అని సమాధానం చెప్తాడు.

13. దైవసహాయం కొరకు మనవి

ఇది విలాప గీతం. ఈ గీతం చెప్పిన భక్తుడు వ్యాధిగా పడివున్నాడు. అతనికి ప్రభువు తన్ను పూర్తిగా మరచిపోయినట్లుగా తోచింది. పగవాళ్ళ కూడ అతన్ని గేలి చేసారు. ఈలాంటి పరిస్థితుల్లో అతడు ప్రభువవైపు మళ్ళి దీనంగా మొరపెట్టుకొన్నాడు. తన్ను ఆదుకొమ్మని మనవి చేసికొన్నాడు. దేవుడు తన్ను ఆదుకొన్నాడని నమ్మి వందనాలు చెప్పకొన్నాడు. ఈ కవిలాగే మనంకూడ వేదనలకు చిక్కినపుడు "ప్రభూ! నీవు నన్నెంతకాలం విస్మరిస్తావు?" అని నమ్మకంతో వేడుకోవాలి.

14. దేవుణ్ణి నమ్మనివాళ్లు

ఇది ప్రవచన కీర్తనం. దీనిలో కీర్తనకారుడు తన నాటి లౌకిక వాదులను హెచ్చరించి మందలిస్తున్నాడు. కొందరు యిప్రాయేలీయులు పూర్తిగా లోకవ్యామోహాల్లో మునిగిపోయారు. వాళ్ళ దేవుడు లేడో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అతన్ని పూజించడం