పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాళ్ళను అదుపులో పెట్టుకొంటాడు. ఈ రాజు పట్టాభిషేక దినాన కీర్తనకారుడు ఈ పాటకట్టి విన్పించి వుంటాడు. దీనిలో మూడంశాలు ఉన్నాయి. 1. రాజు యావే ప్రభువు కుమారుడు. 2. ఈ రాజు తన పరిపాలనంద్వారా దేవుని పరిపాలనంలో పాల్గొంటాడు. 3. అతడు తిరుగుబాటుదారులను అణచివేసి వారిమీద పరిపాలనం చేస్తాడు. మొదట ఓ సామాన్య రాజునిగూర్చి చెప్పిన యీ కీర్తనను తర్వాత నూత్నవేద రచయితలు క్రీస్తుకి అన్వయింపజేసారు. నేడు క్రీస్తు ప్రభువే మనకు రాజు. అతని రాజ్యం మన హృదయాల్లో నెలకొనాలి. అది నీతి ప్రేమ శాంతి సత్యాలతో కూడిన రాజ్యం. ప్రభువు మనకు ఎల్లవేళ ల రాజుగా వుండాలని వేడుకొందాం.

3. హింసితుని ప్రాతఃకాల ప్రార్ధన

ఈ కీర్తన చెప్పిన భక్తని శత్రువులు బాధించారు. ఇరుగుపొరుగువాళ్ళ దేవుడు నిన్నుపట్టించుకోడు అని చెప్పి అతన్ని నిరుత్సాహపరచారు. ఐనా ఆ భక్తుడు అధైర్యపడలేదు. విశ్వాసంతో దేవుణ్ణి నమ్మి అతన్నిశరణువేడాడు. ప్రభువు తన్ను కాచికాపాడతాడని నమ్మాడు. దేవుని అండాదండా తనకుంటాయి కనుక తాను నిర్భయంగా నిద్రపోయి మల్లా సురక్షితంగా మేల్కొంటానని చెప్పకొన్నాడు. ఈ భక్తునిలాగే మనంకూడ కష్టాల్లో దేవుని నమ్మి అతని సహాయాన్ని అడుగుకోవాలి. యుద్ధంలో డాలు సైనికుడ్డి కాపాడినట్లుగా ఆ ప్రభువు మనలను కాపాడాలని మనవిచేద్దాం.

4. సాయంకాల ప్రార్ధన

ఇది విశ్వాస కీర్తన. ఈ పాట కట్టిన భక్తుడు ప్రభువు తన్ను నిరంతరం సంరక్షిస్తాడని నమ్మాడు. దేవుడు తన మొర వింటాడనీ తనకు సాయంచేస్తాడనీ విశ్వసించాడు. భక్తిలేనివాళ్ళ కొందరు అతని నమ్మకానికి అతన్ని ఎగతాళిచేసారు. ఐనా అతడు తన విశ్వాసాన్నికోల్పోలేదు. ప్రభువుకి అంటిపెట్టుకొని వుండడం మాననూలేదు. మనం సురక్షితంగా జీవించేలా చేసేది ప్రభువే. కనుక ఎల్లవేళల అతన్ని అనుసరించే భాగ్యం కొరకు ప్రార్థిద్దాం.

5. ఉదయకాల ప్రార్ధన

ఈ కీర్తనంలో భక్తుడు వేకువజామున దేవళంలో ప్రార్థించాడు. ప్రభువు తనకు సహాయమూ వెలుగూ దయచేయాలని అడుగుకొన్నాడు. తనకు శత్రువులనుండి ప్రమాదం వుంది. అపాయంవుంది. కనుక ప్రభువు తన్ను నడిపించాలనీ తన మార్గం నిరపాయం చేయాలనీ వేడుకొన్నాడు. అతని భక్తి గొప్పది. కనుకనే ప్రభువు కృపాతిశయంవల్ల తనకు దేవళం ప్రవేశించే భాగ్యం కలిగిందని చెప్పకొన్నాడు. మనం దేవుణ్ణి ప్రేమించకముందే

224