పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11. కీర్తనల వివరణం

                                                        మనవి మాట

113, 115,117 నంబర్లు గల సంచికలు కీర్తనల భావాన్ని వివరిస్తాయి. కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలున్నాయి. ఇవన్నీ భక్తులు స్వయంగా చేసికొన్నప్రార్థనలు. వీటిల్లో అమూల్యమైన భక్తిభావాలున్నాయి. మన ప్రజలకు ఈ కీర్తనలను పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ వివరణను తయారు చేసాం.

ఈ వివరణంలో మూడంశాలు పాటించాం. మొదట ఒక్కో కీర్తన పట్టిన సందర్భాన్నితెలియజేసాం. అటుపిమ్మట కీర్తనలోని ప్రధాన భావాన్ని వివరించాం, కడన ఆ కీర్తన ఈనాడు మన ప్రార్థనకు ఏలా వుపయోగ పడుతుందో తెలియజేసాం.

పాఠకులు మొదట ఒక్కోకీర్తనమీద వివరణను చదువుకోవాలి. తర్వాత బైబుల్లో నుండి ఆ కీర్తనను నిదానంగా చదువుకొని దాని భావాలను అర్థంజేసికోవాలి. sex పిమ్మట ఆ కీర్తనను ప్రార్థన చేసికోవాలి. కీర్తనల ధ్యానం ద్వారా భగవంతునికి భక్తితో ప్రార్ధనం జేసికొనే విధానాన్ని నేర్చుకోవచ్చు.

                                                  1. రెండు త్రోవలు

ఈ మొదటి కీర్తనం విజ్ఞాన కీర్తనల వర్గానికి చెందింది. ఇది ప్రభువు ధర్మశాస్రాన్ని పాటించమని హెచ్చరిస్తుంది. రెండు త్రోవలను పేర్కొంటుంది. అవి సజ్జనుల త్రోవ, దుర్జనుల త్రోవ. ఇరుకైన త్రోవ, విశాలమైన త్రోవ. ఈ త్రోవలు నరుల జీవితవిధానాన్ని సూచిస్తాయి. సజ్జనుల త్రోవను ప్రభువు కాచికాపాడతాడు. దుర్జనుల త్రోవ నాశమైపోతుంది. సజ్జనుడు మంచిపండ్లు కాసిన చెట్టలా వుంటాడు. క్రీస్తు చెప్పినట్లు, మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పండునుబట్టి చెట్ట ఎలాంటిదో తెలిసికొంటాం. ఇక, దుర్జనుల త్రోవ కళ్ళంలోని పొట్టలా ఎగిరిపోతుంది. మనం తొక్కే త్రోవ మంచిదా లేక చెడ్డదా అని పరిశీలించి చూచుకోవాలి. మన తరపున మనం సజ్జనుల త్రోవలో నడిచే భాగ్యం కొరకు వేడుకొందాం.

                                                2. ప్రభువు అభిషేకించిన రాజు

ఇది రాజకీర్తనల వర్గానికి చెందింది. ఓయిస్రాయేలురాజు మీద చెప్పిన కీర్తన. ఈ రాజు తండ్రి చనిపోగా సామంతులు ఇతనిమీద తిరుగుబాటు చేసారు. ఈ రాజు 223