పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తల్లిదండ్రులే. తల్లిదండ్రుల నుండి మతసత్యాలు నేర్చుకొని దైవభక్తి అలవర్చుకొన్న బాలలు భావి జీవితంలో తప్పక బాగుపడతారు. తిమొతి వృత్తాంతమే ఇందుకు సాక్ష్యం.

తిమొతి తల్లి యూనికే అమ్మమ్మ లోయి. తండ్రి గ్రీకు మతస్తుడు. యూదుల ఆచారం ప్రకారం చిన్ననాడే జరగవలసిన సున్నతి అతనికి జరుగనే లేదు. ఐనా యూనికే చాల భక్తిమంతురాలు. ఆమె పిల్లవానిచేత చిన్ననాటి నుండే హీబ్రూ పూర్వవేదం చదివించింది. ఆ బాలుడు అమ్మమ్మ లోయి వాడిలో కూర్చుండి పూర్వవేదం చదువుకొని వుంటాడు. పౌలు ఈ కుటుంబానికి ఆప్తమిత్రుడు. కనుక తిమొతి సహజంగానే తర్వాత పౌలుకి శిష్యుడయ్యాడు. పౌలు తాను చనిపోవడానికి కొన్నాళ్లకు ముందు వ్రాసిన రెండవ తిమొతి జాబులో ఆ శిష్యుని బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకొన్నాడు. "మిూ యమ్మమ్మ లోయి, విూ యమ్మ యూనికే విశ్వాసవతులు. వాళ్ల విశ్వాసమే నీకూ సంక్రమించింది" అని అతన్ని భూషించాడు-1.5. తిమెతికి గల బైబులు జ్ఞానాన్ని ప్రస్తావిస్తూ "నీవు చక్కగా నేర్చుకొని గాఢంగా విశ్వసించిన వేదగ్రంథసూత్రాల ప్రకారం నడుసూండు. ఆ గ్రంథాలు నీకెవరు బోధించారో నీకే తెలుసు. చిన్ననాటి నుండే విూయమ్మ నీకు పరిశుద్ధ గ్రంథాలు బోధిసూ వచ్చింది. అవి నీకు క్రీస్తు నందు విశ్వాసం పుట్టిస్తాయి, రక్షణ మార్గాన్ని బోధిస్తాయి" అని అతన్ని ప్రోత్సహించాడు-3,14-15.

పై వాక్యాల ప్రకారం తిమెతికి మొదటి గురువు తల్లే. ఆమె కుమారునికి పూర్వవేదం నేర్చింది. యూదమత భక్తి అంతా బోధించింది. ఆ భక్తురాలి విశ్వాసాన్నీ బైబులు ఆసక్తినీ, మతబోధనీ పౌలు అంతటివాడే మెచ్చుకొన్నాడు. తిమొతి తర్వాత పౌలు శిష్యుడై నూత్నవేద బోధ ప్రారంభించినపుడు పూర్వం తల్లి నేర్పిన పూర్వవేద జ్ఞానం అతినికి బాగా ఉపకరించింది. అతడు చదువుకొన్న పాఠశాల యిల్లే. అతని ఉపాధ్యాయురాలు తల్లే. ఆ రోజుల్లో యూదుల్లో ధనిక కుటుంబాల వాళ్లు విద్య కోసం తమ పిల్లలను ప్రార్థనా మందిరాలకు పంపేవాళ్లు. అక్కడ రబ్బయిలు ఆ పిల్లలకు చదువు చెప్పేవాళ్లు, కాని యూనికే తన బిడ్డను రబ్బయిల చేతికి అప్పగించలేదు. తానే స్వయంగా కొడుక్కి ఉపాధ్యాయురాలైంది. ఆమె గొప్పతనం అదే.

తిమొతి విద్యావిధానమే ఇంచుమించు క్రీస్తుకి గూడ అబ్బి వుండాలి. అతడు ఏరబ్బయి దగ్గర విద్య నేర్చుకోలేదు. యేసు బాల్యాన్ని గూర్చి ప్రస్తావిస్తూ లూకా సువిశేషం "యేసు నజరేతుకు వచ్చి తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు. అతడు జ్ఞానం లోను ప్రాయంలోను వృద్ధి చెందాడు. దేవుని అనుగ్రహాన్ని ప్రజల మన్నననూ పొందాడు" అని చెప్తుంది. - 1,52-52. ఆ బాల్య ప్రాయంలో అతడు ఇంటివద్ద తల్లిదండ్రులకు విధేయుడై