పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పట్టణంలో గబాయేలు అనే మిత్రుడు తోబీతుకు కొంతసొమ్ము బాకీపడి వున్నాడు. వెళ్ళి ఆ సొమ్ము తీసికొని రమ్మని అతడు కుమారుడ్డి పంపాడు. ముక్కూ మొగమూ తెలియని రఫాయేలనే వ్యక్తి తోబియాకు త్రోవచూపరిగా కుదిరాడు. అతడు దేవదూతని తోబియాకు తర్వాత తెలిసింది. ఈ ప్రయాణంలో తోబియా ఓ మడుగులో చేపను పట్టి దాని గుండెను తీసాడు. అది తర్వాత తండ్రి గ్రుడ్డితనాన్ని పోగొట్టడానికి ఔషధంగా ఉపకరించింది. ఇంకా అతడు ఎక్భటానా అనే నగరంలో సార, అనే యువతిని పెండ్లి చేసికొన్నాడు. కుమారుడు వెళ్ళి చాలా రోజుల వరకు తిరిగి రాకపోయే సరికి ఇంటి దగ్గర ముసలి తల్లి దండ్రులు అతని క్షేమాన్ని గూర్చి ఆందోళనం చెందారు. ఇంతలో బాకీ సౌమ్మతో భార్యతో సురక్షితంగా తిరిగి వచ్చిన కుమారుడ్డి చూచి తోబీతుఅన్నాలు ఎంతో సంతోషించారు. ప్రభువుకి వందనాలు అర్పించారు. దేవుణ్ణి నమ్మకొన్న భక్తుల్ని ప్రభువు తప్పక ఆదరిస్తాడనే సత్యాన్ని ఈ తోబీతు కథ చాటి చెప్పంది.

కుటుంబ జీవితంలో బోలెడన్ని ఇక్కట్లు వసూంటాయి. ఒకోమారు సంసారం గడవదు, పస్తులుండవలసి వస్తుంది, దైవ సహాయం కూడ మన మనుకొన్నంత త్వరలో లభించదు- పై తోబీతు కథలో లాగ. అలాంటప్పడు దేవునియందు నమ్మికా ఓపికా వండాలి. ఆ ప్రభువు తను నమ్మిన భక్తులను చేయి విడిచేవాడు కాదు. కనుకనే కీర్తనకారుడు "కొందరు రథాలనూ గుర్రాలనూ నమ్ముకొన్నారు. మేమైతే ప్రభువుని నమ్మకొన్నాం అన్నాడు– 20,7. రథబలాన్ని నమ్మిన ఐగుషీయులు సముద్రంలో మునిగిపోయారు. ప్రభువుని నమ్మిన యిస్రాయేలీయులు ఒడ్డు చేరుకొన్నారు.

7. భగవంతుని మిూద నిష్ట

బైబులు భక్తులు ప్రప్రధానంగా భగవంతుని విూద నిష్ట చూపినవాళ్ళు అబ్రాహాముకి లేకలేక ముసలి ప్రాయంలో ఈసాకు పుట్టాడు. అతడు ఆ బాలుణ్ణి అల్లారుముద్దుగా పెంచుకొంటున్నాడు. కాని ప్రభువుకి అబ్రాహాముని పరీక్షించాలనే బుద్ధి పుట్టింది. కనుక అతని యేకైక కుమారుడ్డి మోరీయా కొండ విూద తనకు బలిగా అర్పించమని అడిగాడు. అప్పడు అబ్రాహాము హృదయంలో ఏలాంటి తుఫాను చెలరేగి వుండాలి? ఆ ముసలి ప్రాయంలో ఆ కుమారుడు గతిస్తే ఇక మళ్లా తనకు బిడ్డడు పుడతాడు అనే నమ్మకం లేదు. మరి యిప్పడు అతన్ని కోల్పోతే జీవితంలో ఇక తనకు మిగిలేదేమిటి? తాను కొలిచే దేవుడు అంత రాతిగుండె గలవాడా? అతన్ని నమ్మి తన సొంత దేశాన్ని కూడా వదలి ఈ దిక్కుమాలిన కనాను గడ్డకు వచ్చి తాను పాముకొందేమిటి? ఈలాంటి నిరాశా భావాలెన్నోయెడలో మెదలి వండాలి. ఐనా అబ్రాహాము మహాభక్తుడు. అనన్యచిత్తంతో యావేనే సేవించేవాడు. కనుక పిల్లవాణ్ణి బలి ఈయడానికి మోరీయా