పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేరుకొన్నాడు. అప్పడే అబ్రాహాముని తమ్ముడగు నాహోరుని మనుమరాలును బెతూవేలు పత్రికయునగు రిబ్కాకడవ చంకన బెట్టుకొని బావికి నీళ్ళకు వచ్చింది. సేవకుడు అడిగిందే తడవుగా ఆ యమ్మాయి అతనికి దాహం తీర్చుకోవడానికి నీళ్ళిచ్చింది. అతని మౌంట్లకు గూడ నీళ్లు తోడిపోసింది. అటుతరువాత ఆ బాలిక యన్నయైన లాబాను వచ్చి యెలియసేరుని ఇంటికి తీసికొనిపోయాడు. అతనికి చక్కని ఆతిథ్యమిచ్చాడు. ఎలియసేరు యజమానుని బంధువుల యిల్ల చేరుకొన్నందుకు ఎంతో సంతోషించాడు. అబ్రాహాము తమ్ముని మనుమరాలైన రిబ్మాను ఈసాకునకు వధువుగా కుదుర్చుకొన్నాడు - ఆది 24.

కనాను మండలంలో వున్నపుడు అబ్రాహాము మమే అనే తావులో సిందూరవనంలో వసిస్తూన్నాడు. ఒకనాడు ఎండకాసే వేళ అబ్రాహాము గుడారం చెంత కూర్చొని వుండగా అకస్మాత్తుగా ముగ్గురు నరులు దాపులో కనిపించారు. వెంటనే అబ్రాహాము వారిని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చాడు. అప్పడే కాల్చిన రొట్టెలతో, దూడమాంసంతో, పాలుపెరుగుతో వారికి భోజనం పెట్టాడు. వాళ్లు భుజిస్తూండగా తాను వద్దెన చేస్తూ వారి ప్రక్కన నిలబడ్డాడు. కడన ఆ వచ్చిన ముగ్గురు అతిథులు నరరూపంలో వున్న దేవదూతలు (లేక దేవుడు) అని తేలింది. వాళ్ళు అప్పటిదాక గొడ్రాలుగా వున్న సారాకు ఓ యేడాది లోనే బిడ్డడు పుడతాడని చెప్పి వెళ్ళిపోయారు - ఆది 18, 1-15.

ఇవి పూర్వవేదప ఆతిథ్య ధర్మాలు. మన క్రైస్తవ కుటుంబాల్లో గూడ ఈ ధర్మాన్ని అత్యవసరంగా పాటించాలి. "నా శిష్యుల్లో అత్యల్పులైనవాళ్ళకి మిూరు మేలుచేసినపుడు ఆ మేలును నాకు చేసినట్లే భావిస్తాను" అన్న ప్రభువాక్యం కూడ వుంది- మత్త25,40, కుటుంబ సభ్యులు మొదట ఒకరినొకరు ప్రేమాదరాలతో చూచుకోవాలి. అటుపిమ్మట తమ యింటికి వచ్చిన పరాయివాళ్ళను కూడ గౌరవమర్యాదలతో చూడాలి. మంచివాళ్లు ఈ ప్రపంచంలోని జనులంతా తమ కుటుంబానికి చెందినవాళ్లేనని భావిస్తూంటారు.

6. దేవుని మీద నమ్మిక

స్ర్తీ పురుషులను సృజించి వారికి వివాహ బంధాన్ని కలిగించిన దేవుడే వారి కుటుంబ జీవితానికి గూడ కర్త జీవితంలోని కష్టసుఖాల్లో ఆ ప్రభువుని నమ్మి అతని మరుగు చొచ్చిన వాళ్ళను అతడు తప్పకుండా ఆదుకొంటాడు. తోబీతు కథే దీనికి తార్మాణం. తోబీతు గలిలయలోని యూద భక్తుడు. అతని భార్య పేరు అన్న కుమారుని పేరు తోబియా, అస్పిరియా రాజులు పాలస్తీనా దేశాన్ని జయించి యూదులను చెరగొనిపోయారు. అలా బందీలుగా వెళ్ళినవాళ్ళల్లో తొబీతు కుటుంబం కూడ ఒకటి. అతడు ప్రవాసిగా : పట్టణంలో వసిసూ చాల బాధలు అనుభవించాడు. కంటిచూపు కూడ పోయింది. ఇక పని చేయలేకపోయాడు. అన్నా కూలినాలి చేసి కుటుంబాన్ని పోషిస్తూండేది. రాగీసు