పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. కుటుంబ సభ్యులు

ఎలీమెలెకు బేల్లెహేము వాసి. అతడు కరవు కారణంగా తన భార్యయైన నవోమిని తీసికొని మోవాబు దేశానికి వలస పోయాడు. అక్కడ వాళ్లకు మహోను కిల్యోను అనే కుమారులు కలిగారు. వాళ్లిద్దరూ రూతు, ఓర్చా అనే మోవాబు ఆడపడుచులను పెండ్లి చేసికొన్నారు, అటుతరువాత తండ్రీ కొడుకులు చనిపోయారు. అత్తాకోడళ్లు మాత్రం అక్కడే మిగిలిపోయారు. అప్పడు నవోమి జన్మదేశమైన బేల్లెహేము మండలానికి తిరిగి వెళ్లిపోవాలనుకుంది. కోడళ్లు గూడ ఆమెతో తిరిగి రాగోరారు. అత్త ప్రోద్బలంపై చిన్న కోడలైన ఓర్చామోవాబు దేశంలోనే ఆగిపోయింది. అక్కడ మరెవ్వరినో పెండ్లి చేసికొంది. కాని పెద్ద కోడలైన రూతు మాత్రం అత్త వద్దన్నా వినకుండా ఆమె వెంట బేల్లెహేముకు తిరిగివచ్చింది. రూతుకు నవోమి అంటే పరమ గౌరవం. నవోమికి గూడ రూతంటె అమిత ప్రేమ, నవోమి రూతును బేల్లెహేము వాసీ తన దగ్గరి బంధువూ ఐన బోవసుకిచ్చి పెండ్లి చేసింది. వాళ్ళకు కలిగిన బిడ్డట్టి తాను దత్తు తీసికొంది. ఈలా కుటుంబ సభ్యులందరినీ ప్రేమ భావంతో అలరించిన అమృతమూర్తి నవోమి. ఆమెను చూచి క్రైస్తవ కుటుంబసభ్యులు కూడ ఒకరి పట్ల ఒకరు ఒద్దికగా మెలగుతూ అనురాగంతో ప్రవర్తించడం నేర్చుకోవాలి.

4. అత్తాకోడళ్లు

నవోమికోడళ్ళను సొంత కూతుళ్ళను లాగ చూచుకొంది. కొడుకులు చనిపోగానే ఆ కోడళ్లు మరలా పెండ్లి చేసికొని సుఖించాలనే ఆమె కోరిక. కోడళ్ళ తరపున కోడళ్లు గూడ ఆమెను సొంత తల్లిలాగే చూచుకొనేవాళ్లు, ఆమె కోడళ్లు మోవాబు దేశంలోనే వుండిపోవాలనీ తన వెంట బేల్లెహేముకు తిరిగి రాకూడదనీ చెప్పగా రూతు "నన్ను నీవెంట రావద్దని వారించవద్దు. నీవు పోయేకాడికే నేనూ వస్తాను. నీవు వుండే కాడే నేనూ వుంటాను. నీ బంధువులే నా బంధువు లౌతారు. నీ దేవుడే నా దేవుడౌతాడు. నీవు చనిపోయే కాడే నేనూ చనిపోతాను. నిన్ను పాతిపెట్టినకాడే నన్నూ పాతిపెడతారు" అందిరూతు 1,16-17. ఇవి పూర్వవేదంలోని అతి ప్రశస్త్ర వాక్యాలకు చెందినవి. నవోమి రూతు ఆదర్శవతులైన అత్తా కోడళ్లు. ఈ యాదర్శ మహిళలను చూచి చీటికిమాటికి కీచులాడుకొనే మన కుటుంబాల్లోని అత్తాకోడళ్లు పాఠం నేర్చుకోవాలి.

5. ఆతిథ్యం

అబ్రాహాము తన కుమారునికి వధువును తీసికొని రావడానికై ఎలియసేరు అనే సేవకుని పంపాడు. అతడు ఒంటెలతో వెళ్ళి సాయంసమయాన నాహోరు పట్టణాన్ని