పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బయలుదేరాడు. ఈ సంగతి పసికట్టిన అబీగాయిలు వలసినన్ని భోజనపదార్థాలు సిద్ధం చేసికొని వెళ్లి త్రోవలో దావీదుని కలసికొని అతని కోపాన్ని చల్లార్చింది. భర్త ప్రాణాలు కాపాడింది. -1సమూ 25. ఈ యలీగాయిలు తన భర్త మూర్థుడయినా అతన్నంగీకరించి, గాఢంగా ప్రేమించింది. సంసార జీవితంలో ఈలాంటి ప్రేమ అవసరం. లేకపోతే భార్యాభర్తలకు పొందిక యేర్పడదు. కుటుంబం కొనసాగదు.

ఎల్కానా అనే అతనికి అన్నా పెనిన్నా అని యిద్దరు భార్యలు. పెనిన్నాకు సంతానం కలిగింది గాని అన్నా గోడ్రాలుగా వుండిపోయింది. సవతికి బిడ్డలు కలిగి తనకు కలగక పోవడం చూచి అన్నా దేవాలయానికి వెళ్లిబోరున ఏడుస్తూ కూర్చుంది. అన్నపానీయాలు కూడ మానివేసింది. అప్పుడు ఎల్మానా "అన్నా! ఈ యేడ్పు ఈ దిగులు దేనికి? నీవు అన్నం మానివేయడం దేనికి? నేను నీకు పదిమంది కుమారుల పెట్టు కాదా." అని భార్యను ఓదార్చాడు -1సమూ 1,8. పదిమంది కుమారులు కలిగిందానికంటె గూడ భర్తను ఒక్కణ్ణి చూచుకొని అన్నా అమితానందం చెందేదిట. అనగా అతని మిూద అంత గాఢప్రేమ వుండేదని భావం, భార్యాభర్తల మధ్య పండవలసిన పవిత్ర ప్రేమ ఈలాంటిది. క్రైస్తవ కుటుంబాల్లో దంపతులు ఈలాంటి ప్రేమను పెంపొందించుకొంటుండాలి.

2. మన్నింపు

హోషేయ ప్రవక్త. అతని భార్య గోమెరు. వాళ్లకు ముగ్గురు పిల్లలు పట్టారు. హోషేయ గోమెరును గాఢంగా ప్రేమించాడు. కాని చంచలబుద్ధి గల గోమెరుకు మాత్రం అతని మిూద మనసు కుదరలేదు. ఆమె వ్యభిచారిణియై భర్తను విడిచిపెట్టి వెళ్లిపోయింది. కొంత కాలమయ్యాక గోమెరు బుద్ధితెచ్చికొని మళ్లా హోషేయ వద్దకు తిరిగివచ్చింది. తన్ను స్వీకరింపమని బతిమాలింది. హోషేయ కరుణతో ఆమెను మల్లా చేపట్టాడు. మొదట అతని అభిమానం అడ్డుతగిలినా ఆ ప్రవక్త హృదయములోని గాధప్రేమ భార్య ద్రోహాన్ని క్షమించేలా చేసింది.

గోమెరు భర్తను పరిత్యజించినట్లే యిప్రాయేలు ప్రజలు కూడ యావేను విడనాడి అన్యదేవతలను కొలుస్తున్నారు. ఇది ప్రభువుకి బాధ కలిగించింది. ఐనా ప్రభువు కరుణతో యిస్రాయేలు తప్పిదాలను క్షమించాడు. ఆ ప్రజల విగ్రహారాధనను గోమెరు వ్యభిచారంతో పోల్చి చెప్పాడు ప్రభువు. హోషేయ ప్రవచన గ్రంథంలోని ముఖ్యాంశం ఇదే. ఈలా ఆ ప్రవక్త తన గ్రంథంద్వారా మాత్రమే గాక తన జీవితంద్వారా కూడ ప్రేమ తత్వాన్నీ క్షమాధర్మాన్నీ బోధించాడు.