పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. అన్వయం. మనమూ నిత్యం ప్రభువుని అంటిపెట్టుకొని వుంటూంటాం. రోజూ అతన్ని సేవిస్తూంటాం. మన పనులన్నీ అతని సేవకొరకే. కనుక ప్రభువు ఆయపోస్తల కిస్తానన్న మోక్షభాగ్యం మనకూ యిచ్చితీరుతాడు.

4 ప్రార్థనాభావాలు

1. ప్రభువు పలికిన పై వాక్యాలు మనకు భయాన్నీ నమ్మికనూ గూడ కలిగించాలి. భయమెందుకంటే "తొలుత నరుడు భగవంతుణ్ణి విడనాడితేనేగాని భగవంతుడు నరుడ్డి విడనాడడు". కనుక మనం ప్రభుని విడనాడగలం. చాలామంది ఆలా చేసారుగూడ, మనకూ ఈ దుర్గతి పట్టవచ్చు. ఇక నమ్మిక దేనికంటే, మనం తన ప్రేమయందు స్థిరంగా నిలిచేలా చేసేది ఆ ప్రభువే - 2 తెస్స 1, 12 ప్రభువు తన్ను చిత్తశుద్ధితో సేవించేవాళ్లను చేయివిడువడు.

2. వివేకవతులైన కన్యలు ప్రభువుకోసం ఎదురుచూస్తూన్నారు. ప్రభువు రాగానే ఈ కన్నెలు దివ్వెలు వెలిగించుకొని అతనితోపాటు వివాహశాలలోనికి ప్రవేశించారు - మత్త 26, 6-10. యూదులు మోక్షాన్ని వివాహపువిందుగా భావించేవాళ్లని చెప్పాం. ఈ కన్నెల్లాగే మనంకూడ ఈ జీవితయాత్రలో ప్రభువుకోసం వేచివుండాలి. అతన్ని భక్తిభావంతో సేవిస్తూండాలి. అప్పడు ప్రభువు విజయంచేసి మనలను తనతోపాటు మోక్షానికి తీసికొని వెళాడు.

3. ఆగ్సెస్కన్య మూడవశతాబ్దిలో వేదసాక్షిగా మరణించింది. మరణానికి ముందు ఆమె యీలా పలికింది. "ఆ ప్రభువుని తెలిసి కొన్నాను. తెలిసికొని ప్రేమించాను. ప్రేమించి అతన్నే వరించాను. వరించి అతనిమీదనే భారంవేసాను. ఇక నా కన్యాత్వాన్ని కాపాడేనాథుడు అతడే", ఇవి చాలా భక్తిమంతమైన వాక్యాలు. గురువులంగా మరకన్యలంగా మనం ఎన్నుకుంది ఆ ప్రభువునే. మనలను రక్షించి కాపాడేదీ, కాపాడి మోక్షానికి తీసికొనివెళ్లేదీ ఆ ప్రభువే.

4. అగస్తీను భక్తుడు "ప్రభో! మా హృదయాలను నీ కొరకే సృజించావు. నీయందు విశ్రమించిందాకా వాటికి విశ్రాంతి అంటూ లేదు" అని నుడివాడు. ఈ ప్రపంచంలోని ధనమూ, అధికారమూ, సుఖభోగాలూ కీర్తి ప్రతిష్ఠలూ కొంత తృప్తినిస్తాయి. కాని అవేవీ మన హృదయానికి పూర్ణతృప్తినీయలేవు. ఎందుకు? మన హృదయం దేవునికొరకు సృజింపబడింది. అతన్ని పొందితేనేగాని దానికి పూర్ణతృప్తి అంటూలేదు. ఇక, కన్యాజీవితమూ గురుజీవితమూ దేవుణ్ణి ప్రేమించి సేవించే జీవితం. అతన్నిపొందే జీవితం. కనుక ఈ సేవాజీవితంద్వారా మన హృదయం పూర్ణానందాన్నీ పూర్ణశాంతినీ పొందుతుంది. దేవునికి పోలికగా కలిగింపబడిన నరునికి ఆ దేవునీ పొందడంకంటె గొప్పభాగ్య మేముంటుంది? 204