పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

{

{p|fs150}}

2. నాతండ్రియెదుట నేనూ అంగీకరిస్తాను


"ప్రజలయెదుట నన్ను అంగీకరించేవాణ్ణి పరలోకంలోని నా తండ్రియెదుట నేనూ అంగీకరిస్తాను" - మత్త 10,32.
 1. సందర్భం. ఇక్కడ ప్రభువు వేదహింసలనుగూర్చి మాటలాడుతూన్నాడు.హేమ్సలోగూడ మనం ప్రబుని అమ్గికరించాలే.
 2. నియమం. ఇక్కడ మనం ప్రభుని అంగీకరించడం ప్రధానం. ఇప్పడు హింసలు లేవుగదాంటే రోజురోజు ప్రభుని అంగీకరించేవాళ్లకు, అహింసలు వచ్చినపుడు వాటిల్లోగూడ అతన్ని అంగీకరించేభాగ్యం లభించదా? లేని హింసలను మనం సృజించలేంగదా? కనుక మనతరఫున మనం రోజు అతన్ని అంగీకరిస్తేచాలు.
 3. భావం. మన చేయవలసింది, ఈ జీవితంలో ప్రభుని అనుసరించడమూ అతన్ని అంగీకరించడమూను. అతడు చేసేది, పితయెదుట మనలను అంగీకరించడం. అనగా అతడు మోక్షంలో పిత సమక్షాన మనలను నిలుపుకొంటాడని భావం.
 4. అన్వయం. మన యీ గురుజీవితమంతా, మరజీవితమంతా, ప్రభుని అంగీకరించడమేగదా! ప్రభువుపట్ల మనం జూపే ఈ యంగీకారం మోసమైందికాదనీ యథార్థమైందేననీ ఆశిద్దాం. ఈ పట్టున మనకొరతలనూ లోపాలనూ సవరించేదిగూడ ఆ ప్రభువే.

3. నేనూ మీకు రాజ్యాన్నిస్తాను


 "నా శ్రమల్లో నాకు తోడుగా వున్నవాళ్ల మీరే. నా తండ్రి నాకు రాజ్యమిచ్చినట్లే నేనూ మీకు రాజ్యమిస్తున్నాను. మీరు నారాజ్యంలో నాతోపాటు విందారగిస్తారు. సింహాసనంమీద కూర్చుండి పండ్రెండు గోత్రాల యిప్రాయేలీయులకూ తీర్పులు తీరుస్తారు" - లూకా 22, 28-30.
 1. సందర్భం. అపోస్తలులకు తమలో ఎవరు గొప్పవాళ్లు అన్న వివాదం పట్టింది. అందుకు ప్రభువు వాళ్లను మందలించి, గొప్పవాళ్ల కాగోరేవాళ్లు ఇతరులకు సేవకులు కావాలి అన్నాడు. తానూ పితకు సేవకుట్టేనని చెప్పాడు. ఈ సేవకులే తర్వాత రాజ్యం చేస్తారనిగూడ చెప్పాడు.
 2. నియమం. మనం ప్రభువుకి సేవచేస్తూ అతనితో వుండిపోవాలి. శిష్యులు తన్ను వుండడాన్నిజూచి ప్రభువు సంతృప్తిచెందాడు.
3. భావం. శిష్యులతరపున శిష్యులు ప్రభుని సేవించాలి. ప్రభువుతరపున ప్రభువు ఈ సేవకులకు రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. తనతోపాటు వాళూ విందులో పాలుపొందేలా చేస్తాడు. ఇక్కడ విందు అంటే మోక్షమే. యూదులు మోక్షాన్ని ఓ వివాహపు విందుగా భావించేవాళ్లని చెప్పాం. ప్రభువు తనతోపాటు శిష్యులనుగూడ తీర్పరులను చేస్తాడు. అనగా మంచి సేవకులు ప్రభువుతోపాటు శాశ్వతంగా మోక్షపాలన జేసూ ఆనందిస్తారని భావం.
203