పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాసెడోనియా నరుడొకడు అతనికి కలలోకన్పించి మా రాష్ట్రానికివచ్చి మాకు సహాయం చేయమని వేడుకొన్నాడు. పౌలు ఆ స్వప్నాన్ని దైవప్రేరణంగా భావించి మాసెడోనియాలో సువార్తను ప్రకటించడానికి ప్రయాణమయ్యాడు - అకా 16,9. ఈ పౌలులాగే మనంకూడ తోడినరులకు క్రీస్తుని తెలియజేయడానికి పూనుకోవాలి. ఇది తోడిజనానికి మనంజేసే గొప్ప సహాయం.

2. ఓ బాధ్యత

ప్రేషితకార్యం ధర్మంజేయడంలాంటిది గాదు. అది మన ఉదారత్వంమీద ఆధారపడి ఉండేదిగాదు. అది ఓ పెద్ద బాధ్యత. మనం పేషితులంగా మెలగకపోతే నాశమైపోతాం. కనుకనే పౌలు "సువార్తను బోధించినంతమాత్రాన్నే నాకు గొప్పలు చెప్పకొనే హక్కేమిలేదు. సువార్తను ప్రకటించమని ప్రభువు నన్నాజ్ఞాపించాడు. కనుక ఆ పనిచేయకపోతే నాకు దారుణమైన శిక్ష పడుతుంది" అని చెప్పాడు - 1 కొ 9, 16. వత్తి తన్నుతాను కాల్చుకొంటూ వెలిగిపోతూంటుంది. ఆలాగే పౌలుకూడ తన్నుతాను వ్యయపరచుకొంటూ ప్రేషితరంగంలో రేయింబవళ్ల కృషిచేసాడు -2 కొ 12, 15. ఈ పౌలులాగే తామ్ముతాము ప్రేషిత జీవితానికి సమర్పించుకొని తమజీవితాన్ని తాము వ్యయంజేసికొనే గురువులూ మరకన్యలూ ధన్యులు.

3. మన ఋణం

పిలుపును పొందడంద్వారా మనం దేవునికి ఋణపడతాం. కాని ఈ ఋణాన్ని దేవుడు ఆత్మలపరంచేస్తాడు. కనుక మనం ఋణం తీర్చుకోవాలంటే తోడిజనానికి మేలు చేయాలి - రోమా 1, 14. ఇక,తోడిజనానికి చేసిన మేలును ప్రభువు తనకు చేసినట్లే భావిస్తాడు. కావుననే అతడు "నా సోదరులలో అత్యల్పనికి చేసిన మేలికార్యం నాకు చేసినట్లే భావిస్తాను" అన్నాడు - మత్త 25, 40.

4. మనం గృహనిర్వాహకులం

ధనవంతుల యిండ్లల్లో గృహనిర్వాహకులనేవాళ్లుంటారు. వీళ్ల యజమానుల ఆదాయవ్యయాలను విచారిస్తూంటారు. సేవకులచేత పనిచేయించుకొని వాళ్లకు జీతాలు బత్తాలూ ఇస్తూంటారు, గురువులూ మఠకన్యలూగూడ దేవుడనే యజమానుని యింటిలో గృహనిర్వాహకుల్లాంటి వాళ్లు, "మీరు మంచి గృహనిర్వాహకుల్లాగ మెలగండి. మీరు దేవునినుండి పొందిన ప్రత్యేక వరాలను ఇతరుల మేలుకై వినియోగించండి - 1 పేత్రు 4, 10. మనం యజమానులమూగాదు, అధికారులమూకాదు, ఆ బిరుదాలు దేవునికే చెల్లతాయి. మనం కేవలం గృహనిర్వాహకులం మాత్రమే. అనగా దేవునియింటిని చక్కబెట్టే సేవకులం. కనుక దేవునిసౌత్తును ప్రజలకు పంచిపెట్టడం మనబాధ్యత.