పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. ప్రార్థనా భావాలు

1. ప్రపంచంలో ఇన్ని జాతులుంటే ప్రభువు తమనే యెందుకెన్నుకోవాలా అని ఆశ్చర్యపోయారు పూర్వవేదపు యూదులు. వాళ్లు పెద్దజాతా అంటే కానేకాదు, చాల చిన్న జాతి. వినయవంతులాంటే కానేకాదు, వట్టి తలబిరుసురకం, మరి ప్రభువు వాళ్లనే యెందుకు ఎన్నుకొన్నట్లు? ప్రభువు వాళ్లను అధికంగా ప్రేమించాడు గనుక వాళ్లను ఎన్నుకొన్నాడు. అంతే. మరో కారణమంటూ లేనేలేదు - ద్వితీ 7, 6–8 మన పిలుపుకుగూడ ఇదే కారణం. ప్రభువు మనలను ప్రేమించాడు, తన సేవకు పిల్చుకొన్నాడు, అంతే.

2. ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించాడు అంటే ఆమెలో యేదో విలువ వండాలి. అందచందాలో, ధనమో, తెలివితేటలో, మంచితనమో యేదోవొకటుండాలి. లేకుంటే ఒట్టినే యువకుడు యువతిని ప్రేమించడు. కాని భగవంతుడు మనలను ప్రేమించి మనలను తన సేవకు ఎన్నుకొన్నాడు అంటే, పై యువతిలోలాగే మనలోగూడ యేదో విలువ వండబట్టిగాదు, భగవంతుడంతటివాడు మోజుపడేవిలువ మనలో యేముంటుంది? అసలు భగవంతుడు మోజుపడేవిలువ అతనికి వెలుపల ఏముంటుందిగనుక? ఐనా అతడు మనలను ప్రేమించాడు అంటే, మనలను తన సేవకు పిలుచుకొన్నాడు అంటే, అది మనగొప్పగాదు అతని గొప్పేవియుండాలి.

3. నరునిలో ఏదో గొప్పతనముందిగనుక భగవంతుడు అతనికి పిలుపు అనే వరాన్నీయుడు. మరి భగవంతుడు నరుని ప్రేమించడంద్వారా అతనిలో ఏదో గొప్పతనాన్ని కలిగిస్తాడు. అంతకు ముందులేని దివ్యగుణాన్ని సృజిస్తాడు. కనుక భగవంతునిప్రేమ సృజనాత్మకమైంది. అతనిపేమకు పాత్రులం గావడంవల్ల మనం ఒకపాటివాళ్ల మౌతం. కనుక మనపిలుపులో విలువలేదు అనకూడదుగాని, ఆ విలువ మననుండి వచ్చింది అనిమాత్రం చెప్పగూడదు. భగవంతుడే తన పిలుపుద్వారా మనకు విలువనిస్తాడు. ఈ యాలోచన మనకు వినయాన్నీ అణకువనూ నేర్పించాలి. మనమీద మనకే నమ్మికను గూడ పుట్టించాలి.

4. క్రీస్తుతో పరిచయం

“దేవుడు తనకుమారుడ్డి నాకు ప్రత్యక్షంచేసాడు" అన్నాడు పౌలు. క్రీస్తును ప్రత్యక్షంచేసికోవడమే మన సెమినరీ, నోవిష్యేటు తర్ఫీదు. కనుక ప్రస్తుతాధ్యాయంలో ఈ తర్ఫీదును గూర్చి కొన్నివిషయాలు పరిశీలిద్దాం.

1. ప్రభు శిష్యులు

ఎన్నికా పిలుపూ,అయ్యాక ప్రభువు శిష్యులను ఏలా తయారుచేసాడు? "ప్రభువు కొండమీదికెక్కి తనకిష్టమైన వాళ్లను పిలువగా వాళ్లు ఆయనవద్దకు వచ్చారు. వాళ్లంతాగలిసి