పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుసు? మన తల్లికిగూడ తెలీదు. ఆమె యింకా మనలను కంటితో చూడనేలేదు. ఐనా మనం తల్లిగర్భమనే చీకటి కోనేటిలో వుండగనే ప్రభువు మనలను ఆదరంతో వీక్షించాడు. అప్పటికింకా మనకు జన్మపాపం వుంది. ఐనా ప్రభువు మనలను చిన్నచూపు చూడలేదు. అసలు మనం తల్లికడుపున బడినప్పటినుండే ప్రభువు మనలను తన సేవకు అంకితం జేసికొన్నాడు. తొలుతటినుండీ మనం అతని వాళ్లమే. కనుకనే ప్రభువు యిర్మీయా ప్రవక్తకు ఈలా సెలవిచ్చాడు. "నీవు మాతృగర్భంలో රෙෆියරජුකාරයී నిన్ను గూర్చి నాకు తెలుసు. నీవు తల్లికడుపునుండి వెలువడకముందే నేను నిన్ను ప్రతిష్టించాను. నిన్ను అన్యజాతులకు ప్రవక్తగా నియమించాను" - యిర్మీ 1.5, ప్రవక్త తన పిలుపునుగూర్చి చెప్పకొన్న ఈ వాక్యాలనే పౌలు తన పిలుపుకుగూడ అన్వయించుకొన్నాడు. ఇదే వాక్యాలను ఈనాడు మన పిలుపుకీ వర్తింపజేసికోవచ్చు.

ప్రభువుకి మనలనుగూర్చి ముందుగనే తెలుసు అనేభావం పౌలుకి ఎంతైనా నమ్మికనూ ఉత్సాహాన్నీ పట్టించింది, అందుకే అతడు తనజాబులో "యేసుక్రీస్తు దాసుడూ, ప్రేషితుడుగా పిలువబడినవాడూ, దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రత్యేకింప బడినవాడూ ఐన పౌలు రోమాపురిలోని దేవుని ప్రియులందరికీ వ్రాయునది” అని సగర్వంగా చెప్పకొన్నాడు - రోమా 1,1. ప్రపంచములోని ప్రజలు తమ పేర్లకు ఎన్నో బిరుదాలూ డిగ్రీలూ తగిలించుకొంటారు. కాని మనకు వాటితో అవసరంలేదు. మన బిరుదాలు ఏసుక్రీస్తు దాసుడు, ప్రేషితుడుగా పిలువబడినవాడు, దేవుని కృపచేత ప్రత్యేకింపబడినవాడు - ఇవి. మనకు ఈ పేర్లు చాలు. మరియు ఎలిసబేత్తును సందర్శించడానికిరాగా ఆమె "ప్రభువు తల్లి నావద్దకు రావడమా? ఈభాగ్యం నాకేలా ప్రాప్తించింది?" అని విస్తుపోయింది - లూకా 1, 43. ఆలాగే మనంకూడ ఎన్నిక అనే భాగ్యానికి నోచుకొన్నందుకు ఎంతో విస్తుపోవాలి.

3. పౌలు అనుభవం

ఎన్నిక అనేది చాల గొప్పభాగ్యం. పౌలు ఈ యెన్నిక అనేవరం తనకేలా సిద్ధించిందా అని ప్రశ్నించుకొని ఈలా జవాబిచ్చాడు. "ప్రభువు మనలను పరిశుద్దజీవితం జీవించడానికి పిల్చాడు. ఈలా పిలిచింది మనంచేసిన సత్కార్యాలను బట్టిగాదు, తన సంకల్పంద్వారానే. అనాది కాలంనుండీ యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడిన వరప్రసాదంద్వారానే", - 2 తిమె 19. ఇక్కడ పౌలు సూచించిన భావాలు ఈనాడు మనకూ అక్షరాల వర్తిస్తాయి. వీటిని కొంచెం విపులంగా పరిశీలిద్దాం.

1. "మన సత్కార్యాలను బట్టిగాదు, తన సంకల్పంద్వారానే". ప్రభువు పిలిచేప్పటికి మనంలేము. మన సత్కార్యాలు అసలేలేవు. ఐనా ప్రభువు స్వయంగానే ఈ యెన్నిక అనే

186