పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాగుంటుంది అనే సందేహం కలుగుతుంది. మామూలుగా విద్యార్థులు ఎవరి విద్యాసంస్థల్లో చదువుకొంటారో వాళ్లల్లో చేరుతూంటారు. ఎందుకంటే ఆ గురువులనుగూర్చీ, ఆ మఠకన్యలనుగూర్చీ మనకు కొంత పరిచయముంటుంది. వాళ్లకూడ మనం తమలోచేరాలనే కోరుకుంటూంటారు. కాని మనకు ఒకోమారు వేరేవాళ్ల సభలో చేరాలనికూడ కోరిక పడుతుంది. దీనికి బలమైన కారణాలుకూడ వుండవచ్చు. ఆలాంటప్పుడు నిరభ్యంతరంగా మనం కోరుకొన్న సభలో చేరవచ్చు. ఈ విషయంలో ఏదైనా సందేహంకలిగితే తల్లిదండ్రులూ ఆత్మగురువులూ మొదలైనవాళ్లను సంప్రతించాలి.

ఈ యధ్యాయంలో పిలుపుగూర్చి కొన్ని విషయాలు సూలంగా జెప్పాం. ఈ యంశాలు ఇంకా పాఠశాలల్లోను కళాశాలల్లోను చదువుకొనే విద్యార్థులకొరకు, ఇక రాబోయే అధ్యాయాల్లో పిలుపును సవిస్తరంగా వివరిస్తాం. ఆ వివరాలు ఈ వరకే నోవిష్యేటుల్లోను సెమినరీల్లోను చేరిన యువతీయువకులకు ఎక్కువగా ఉపయోగపడతాయి.

2. ఎన్నిక

పౌలు తన పిలుపునుగూర్చి చెప్పకొంటూ యిూలా వ్రాసాడు : 1 నేను తల్లి గర్భంలో రూపొందినప్పటినుండే దేవుడు నన్ను ప్రత్యేకపరచాడు, 2 తన కృపచేత నన్ను పిలిచాడు. 3 తన కుమారుడ్డి నాకు ప్రత్యక్షంచేసాడు. 4 నేను అన్యజనులకు తన కుమారుడ్డి ప్రకటించాలని కోరుకొన్నాడు - గల 115 -16. పౌలుచెప్పిన పైనాల్లభావాలను నాలు అధ్యాయాల్లో విపులంగా పరిశీలించి చూద్దాం. ఈ మొదటి అధ్యాయంలో "దేవుడు నన్ను ప్రత్యేకపరచాడు" అనే భావాన్ని చూద్దాం. దీన్నే ఎన్నిక అంటాం.

1. ఆకర్షణం

దేవుడు కొందరు స్త్రీ పురుషులను తన పనికై యెన్నుకొంటాడు. ఈ యెన్నికలో రెండంశాలు ఉంటాయి. మొదటిది, ప్రభుపు తానెన్నుకొనిన వ్యక్తిని పాపపు ప్రపంచాన్నుండి వేరుచేస్తాడు. రెండవది, పవిత్రుడైన భగవంతుడు ఆ వ్యక్తిని తన సేవకు అంకితం జేసికొంటాడు. యెషయా యిర్మీయావంటి ప్రవక్తలూ, మోషే దావీదులాంటి నాయకులూ, అపోస్తలులూ మరియావంటి భక్తులూ ఈ లక్షణాలు కలవాళ్లే ప్రభువు తానెన్నుకొనిన వ్యక్తిని తోడిజనంనుండి వేరుజేస్తాడు. తన వరప్రసాదంతో ఆ వ్యక్తిని తనవైపు బలంగా ఆకర్షించుకొంటాడు. ఈ యాకర్షణనుగూర్చి మాట్లాడుతూనే క్రీస్తు ఓమారు "నా తండ్రి ఆకర్షిస్తేనేతప్ప ఎవరూ నాచెంతకు రాలేరు" అని పల్కాడు - యోహా 6,44

2. ప్రభువుకి మనలనుగూర్చి ముందుగనే తెలుసు

"నేను తల్లిగర్భంలో రూపొందించినప్పటినుండే ప్రభువు నన్ను ప్రత్యేకపరచాడు" అన్నాడు పౌలు, ఇది చాల గొప్పభావం. మనం పుట్టక పూర్వం మనలనుగూర్చి ఎవరికి 185