పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నడిపిస్తున్నాయి. ఈ యాస్పత్రుల్లో వైద్యసేవ చేసేవాళ్లు కావాలి. పేదసాదలనూ బలహీన వర్గాలనూ అర్ధికంగాను సాంఘికంగానూ ముందుకి తీసికొనిరావడానికి మన వాళ్లు సాంఘిక సేవాకార్యక్రమాలను ఎన్నిటినో చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల్లో పనిచేసేవాళ్లు ఉండాలి. ఇక, క్రీస్తుని బోధిస్తూ సువిశేషాన్ని ప్రకటిస్తూ జ్ఞానోపదేశసేవ చేసేవాళూ కావాలి. ఈ సేవాసంస్థలన్నిటినీ కొనసాగించుకొంటూ పోవాలంటే ఎంతోమంది యువతీయువకులు ముందుకివచ్చి వీటిల్లో గురువులుగా మఠకన్యలుగా పనిచేయాలిగదా? ముసలివాళ్ళు పనినుండి విరమించుకొంటూంటే వయసువాళువచ్చి పనిలో చేరుతూండాలిగదా? చోద్యమేమిటంటే, మన యువతీయువకులు క్రైస్తవ సంస్థల్లో చదువుకొని వృద్ధిలోకి వస్తూంటారు. కాని తర్వాత ఈ సంస్థల్లోచేరి సేవచేయడానికిమాత్రం ఎంతమాత్రమూ ఒప్పుకోరు. ఇది వట్టి స్వార్థం.

3. కన్యాజీవితపు విలువ

రీత, సుజాత అని యిద్దరమ్మాయీలు. వాళ్లిద్దరూ తోటలోనికివెళ్లి రెండు గులాబీపూలు కోసుకొన్నారు. రీత తాను కోసికొనిన పూవును జడలో ముడుచుకొని యెంతో సంతోషించింది. కాని సుజాత తనపూవును తీసుకొనివెళ్లి గుల్లో దేవుని పాదాలవద్ద సమర్పించింది. రీత పూవును జడలో పెట్టుకోవడం మంచిదే. కాని సుజాత పూవును దేవునికి సమర్పించుకోవడం అంతకంటె మంచిది. ఓ యువతి తన జీవితాన్ని ఓ పురుషునికి అర్పించుకొని అతనితో వివాహజీవితం జీవించడం మంచిదే. కాని అదేయువతి తన జీవితాన్ని భగవంతునికి నమర్పించుకోవడం అంతకంటె యోగ్యమైంది. వివాహితమైనయువతి భర్తనేలా సంతోషపెట్టాలా అని లౌకిక విషయాలతో సతమత మౌతూంటుంది. కాని అవివాహితయైన మఠకన్య ప్రభువునేలా సంతోషపెట్టాలా అని ఆధ్యాత్మిక విషయాలతో సతమతమౌతూంటుంది. ఇదే నియమం వివాహితుడైన పురుషునికీ అవివాహితుడైన గురువుకీగూడ వర్తిస్తుంది. కన్యాజీవితంలోను గురుజీవితంలోను వుండే విలువంతా యిక్కడే వంది - 1కొ 7, 32-34.

4 కన్యాజీవితానికే శాశ్వతస్థితి

వివాహజీవితం కేవలం ఈలోకంకొరకు ఉద్దేశింపబడింది. ఇక్కడి ప్రజలు చనిపోతుంటారుగనుక వివాహజీవితంత్వారా క్రొత్త జనాన్ని కనవలసివుంటుంది. కాని మోక్షంలోని నరులు చనిపోరు. అక్కడ క్రొత్తవాళ్లను కనవలసిన అవసరంలేదు. కనుక అక్కడ వివాహజీవితమంటూ వుండదు. అక్కడివాళ్లు పెండ్లి చేసుకోరు. శాశ్వతంగా దేవదూతల్లా వుండిపోతారు. కన్యాజీవితంగూడ ఈలా అవివాహితులుగా వుండిపోవడమే.