పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9.పిలుపు

బైబులు భాష్యం - 26

విషయ సూచిక

1. సేవా జీవితం 182
2. ఎన్నిక 185
3. పిలుపు 188
4. క్రీస్తుతో పరిచయం 190
5. సువార్తను ప్రకటించడం 194
6. ఆత్మరక్షణ కాంక్ష 196
7. నిగ్రహం 199
8. మోక్షభాగ్యం ధ్రువం 202

1. సేవా జీవితం

గురుజీవితమూ కన్యాజీవితమూ ప్రధానంగా సేవాజీవితం. ఈ జీవితాన్ని గూర్చి యిూ తొలియధ్యాయంలో కొన్ని ప్రాథమికాంశాలు తెలిసికొందాం.

1. గురువుల కొరత

మనదేశంలో క్రైస్తవప్రజలు రెండున్నర శాతంమాత్రమే. ఈ సమాజం ఇంకా యెంతో వృద్ధిలోకి రావాలి. క్రైస్తవప్రజలకు సేవలుచేసి వాళ్లను నడిపించే నాయకులు గురువులూ మఠకన్యలూను. కాని ఈ గురువులూ మఠకన్యలూ కావడానికి మన సమాజంనుండి చాలినంతమంది యువతీయువకులు ముందుకి రావడంలేదు. దక్షులైన నాయకులు లేందే క్రైస్తవప్రజలు ఏలా వృద్ధిలోకి వస్తారు? ప్రభువు తననాటి యూదప్రజలనుజూచి వాళ్లు కాపరిలేని మందలాగ వున్నారని చింతించాడు - మార్కు6,34. ఈ వాక్యం నేటి మన క్రైస్తవసమాజాలకూ అక్షరాల వర్తిస్తుంది. కనుక చైతన్యంగల యువతీయువకులు ఉత్సాహంతో ముందుకి వచ్చి గురువులూ మఠకన్యలుగా పనిచేయడానికి పూనుకోవాలి.

2. సేవాభావం

గురుజీవితమూ కన్యాజీవితమూ ప్రధానంగా సేవకొరకు ఉద్దేశింపబడినవని చెప్పాం. గురువూల మఠకన్యలూ క్రైస్తవ సమాజానికి చేసే సేవలు ఏమిటివి? మన క్రైస్తవ సమాజాలు దేశంలో గొప్పగొప్ప విద్యాసంస్థల నెన్నిటినో నడిపిస్తున్నాయి. వీటిల్లో విద్యాసేవ చేసేనాథులు దొరకవద్దా? ఇంకా మన సమాజాలు పెద్దపెద్ద ఆస్పత్రులు