పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రవక్త - 58, 12. "ఇది అనేకులకొరకు చిందబడనున్న నా రక్తం" అంటాడు క్రీస్తు - లూకా 14.24 ప్రవక్తలు వర్ణించిన బాధామయ సేవకుడను నేనేనని ఉత్థాన క్రీస్తు ఎమ్మావు త్రోవలో తెలియజేశాడు. లూకా 24, 25-27. ఈ విధంగా నరుల పాపాలు భగవంతుణ్ణి బాధామయ సేవకుణ్ణి చేసాయి.

23. నరుల హృదయాల్లోని తలంపులు ఎల్లప్పడూ చెడ్డవే - ෂධී 6.5

ప్రవక్తల భావాల ప్రకారం పాపం నరుని హృదయంలో వుంటుంది. "ఈ ప్రజలు పెదవులతో నన్ను మహిమపరుస్తున్నారు గాని వీళ్ళ హృదయం మాత్రం నాకు దూరంగా వుంది" అంటాడు ప్రభువు యెషయా గ్రంథంలో 29, 18. "నరుని హృదయం అన్నిటికంటె మోసకరమైంది. దాని నెవడు అర్థం చేసికోగలడు?" అంటాడు యిర్మీయా ప్రవక్త - 17,9. నరుల హృదయాల్లోని తలంపులు ఎల్లప్పడూ చెడ్డవిగానే వుంటాయి" అంటుంది ఆదికాండం 6,5.

కావున భగవంతుడు ఈ హృదయాన్ని మారిస్తేనే తప్ప నరుడు పాపాన్ని విసర్జించలేడు. అందుకే ప్రవక్త యెహెజ్కేలు నూత్న హృదయంకోసం ప్రభువును ప్రార్థించాడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను, అనగా విధేయాత్మకమైన గుండెను ఈయమని ఆడిగాడు - 36, 26. యిర్మీయా ప్రవక్త కూడ ప్రజల్లో సున్నతి పొందిన హృదయం నెలకొనాలని కోరుకున్నాడు - 44 ప్రవక్తలు సూచించే ఈ హృదయ పరివర్తనం లేందే పూర్వవేద నరునికిగాని నూత్నవేద నరునికిగాని పాపపరిహారమంటూ లేదు.

24. మీ హృదయాలను కఠినం చేసుకోకండి - కీర్త 95,8

భగవంతుని అనుగ్రహాన్నిధిక్కరించి కొంతమంది తమ హృదయాలను కఠినం జేసికున్నారు. రాయి చేసికున్నారు. ఈజిప్టు ప్రభువైన ఫరో యీలాంటివాడు - నిర్ణ 421. యిస్రాయేలు ప్రజల తొలిరాజైన సౌలూ యిూలాంటి వాడే. ఇది చాల పెద్దపాపం. భగవంతుణ్ణి బుద్ధిపూర్వకంగా నిరాకరించడం, అందుకే కీర్తనకారుడు గూడ "పూర్వం యెడారిలో మెరిబా మాసాల వద్ద మీ పితరులు హృదయాన్ని రాయి చేసుకున్నారు. ఆలాగే మీరూ హృదయాలను కఠినం జేసికోకండి" అని హెచ్చరించాడు - 95, 8. ఈ హెచ్చరిక నూత్న వేదప్రజలమైన మనకూ అక్షరాల వర్తిస్తుంది.

25. మహోన్నతునికి సమానమౌతాను - యెష14,14.

యెషయాప్రవక్త బాబిలోను ప్రభువైన సనెహ్ర్రీబును వర్ణిస్తూ "నేను ఆకాశానికి ఎక్కిపోతాను, మేఘమండలము మీదికి ఎగసిపోతాను, మహోన్నతునికి సమానమౌతాను అని నీ మనస్సులో భావించుకున్నావు. కావున నీవు పాతాళానికి, నరకంలో వో మూలకు