పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జనించేది. తన పూర్వ పాపాలను తలంచుకొని దుఃఖించేవాడు. ఇరుగుపొరుగువాళ్లకు క్రీస్తును బోదించాలనే కోరిక పుట్టుకువచ్చేది. హృదయంలో శాంతిభావమూ ఆనందమూ నెలకొనేవి. ఈ సత్ఫలితాల వల్ల అతడు తాను చూచిన దర్శనాలు యథార్థమైనవేననీ అవి పిశాచం తెచ్చిపెట్టిన మోసాలు కాదనీ నిర్ణయించుకొన్నాడు. 23. జీవితంలో మనం చేసికొనే నిర్ణయాలకు ఇగ్నేష్యను చాల ప్రాముఖ్యమిచ్చేవాడు. మామూలుగా నరులు స్వార్థం కొద్ది తమ కనుకూలంగా వుండేలా నిర్ణయాలు చేసికొంటారు గాని, భగవంతునికి ప్రియపడేలా కాదు. మన స్వార్ణాన్ని గుర్తించి పిశాచం గూడ మనకనుకూలంగా వుండేలాగే ఆయా నిర్ణయాలు చేసికొమ్మని ప్రోత్సహిస్తుంటుంది. ఉదాహరణకు మనకు ఓ పెద్దపదవి సిద్ధించేలా వుంది. దాన్ని మనం అంగీకరించాలా అంగీకరించగూడదా? మన స్వార్థం తప్పకుండా ఆ పదవిని పొందాలనే కోరుకొంటుంది. కాని ఆ పదవికి మనం అట్టే అర్బులం గాదు. దానిని చేపట్టినందు వలన మనకూ యితరులకూ నష్టాలు కూడ కలుగుతాయి. ఈలాంటి పరిస్థితుల్లో స్వార్ణానికి లొంగిపోకుండా మంచి నిర్ణయం చేసికొనే పద్ధతి ఒకటి ఇగ్నేప్యసు వివరించాడు. మొదట మనం ఆ పదవి అంగీకారం వైపూ మొగ్గగూడదు, అనంగీకారం వైపూ మొగ్గగూడదు. మంచి తక్కెడలాగ ఆటగాని యిటుగాని మొగ్గకుండ సమభావంతో వండాలి. అటుపిమ్మట ఈ విషయంలో స్వార్ణానికి లొంగిపోకుండ దేవునికి ప్రియపడేలా నిర్ణయం చేసికోవాలని ఆ ప్రభువు అనుగ్రహం అడుగుకోవాలి. అటుతర్వాత ఆ పదవిని అంగీకరించినందువలన కలిగే ఫలితాలేమిటివో, నిరాకరించినందువలన కలిగే ఫలితాలేమిటివో జాగ్రత్తగా పరిశీలించి చూడాలి. తదనంతరం రెండు పక్షాల్లో ఎటువైపు బలమైన కారణాలు కన్పిస్తే అటువైపే ఎన్నిక చేసికోవాలి. మనస్వార్థం ఎంత కోరుకొన్నా బలమైన కారణాలు కన్పించని పక్షాన్ని ఎన్నుకోగూడదు. అలా చేసికొన్న ఎన్నికను కడన భక్తితో దేవునికి సమర్పించాలి. ఈలా నిర్ణయం చేసికొన్నప్పడు స్వార్ణానికి గాని బంధు పక్షపాతానికి గాని పిశాచప్రేరణకు గాని లొంగిపోవడమంటూ వుండదు. ఇగ్నేప్యసు వ్రాసిన “తపోభ్యాసాలు" అనే గ్రంథం ఈలాంటి ఆధ్యాత్మిక విషయాలతో నిండి వుంటుంది. 24. ఇగ్నేప్యసు రోజుకు రెండుసారులు - మధ్యాహ్నమూ, రాత్రీ - సాధారణమైన ఆత్మశోధనం చేసికొంటూండేవాడు. పైగా రోజూ చాలసారులు ప్రత్యేకమైన ఆత్మశోధనం గూడ చేసికొంటూ వుండేవాడు. ఈ యాత్మశోధనలన్నిటిలో అతడు తన హృదయాన్ని సదాత్మ ప్రబోధిస్తుందా లేక దుష్ణాత్మ ప్రబోధిస్తుందా అని జాగ్రత్తగా పరిశీలించు కొంటూండేవాడు. తన హృదయంలో వెలుగూ ప్రశాంతభావమూ నెలకొని వున్నాయా లేక చీకటీ ఆందోళనమూ చోటుచేసికొంటున్నాయా అని విచారించి చూచుకొనేవాడు. దీనివల్ల తన్ను సదాత్మే నడిపిస్తుందో లేక దుష్టాత్మే నడిపిస్తుందో తెలిసికొంటూండేవాడు.