పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కీర్తనకారుడు - 33, 4-5, ఇంకో కీర్తనకారుడు భగవంతుని కోపానికి భయపడి “నీ కోపంవల్ల మేము గడగడలాడుతూన్నాం" అంటాడు-90, 7 ఈలా వ్యక్తిగతంగా, అనుభవ పూర్వకంగా, పాపభారాన్ని తలంచుకొని బాధపడేవాడెవడో వాడే భక్తుడు.

21. నీవు మా పాపాలన్నిటినీ ఆగాధసముద్రంలో పడవేస్తావు - మీకా 7, 19

పాపంచేసాక ఆ పాపం అలాగే వండిపోతుంది. అనగా నరుడు పాపస్థితిలో వుండిపోతాడు. భగవంతుడు కరుణతో పరిహరించేంతవరకూ పాపం అలాగే వండిపోతుంది. దావీదు నేను పాపంచేసాను అని ప్రవక్త నాతానుతో అన్నాడు. “యావే నీ పాపాన్ని పరిహరించాడు, నీవిక చావవ" అని నాతాను జవాబిచ్చాడు - 2 సమూ 12,13. అనగా ప్రభువు దావీదు పాపాన్ని పరిహరించేంత వరకూ అతడు పాపదశలోనే వుండిపోయాడని భావం. "పడమటికి తూర్పు ఎంతదూరమో, ఆయన మన అతిక్రమాలనూ మననుండి అంతదూరం చేసాడు" అంటుంది కీర్తన 103, 12. అనగా ప్రభువు మన యతిక్రమాలను దూరంచేసేంతవరకూ మనం పాపదశలోనే వుండిపోతామనియర్థం. "నీవు మా దోషాలను తుడిచివేస్తావు. మా పాపాలన్నిటినీ అగాధ సముద్రంలో పడవేస్తావు" అంటుంది మీకా గ్రంథము - 7, 19, అనగా ప్రభువు ఈలా పడవేసేదాకా పాపం పాపితో వుంటుందనే భావం. ఈ వాక్యాలన్నీ పాపిపాపం కట్టుకోవడం మాత్రమే కాదు, భగవంతుడు క్షమించేదాకా పాపదశలోనే వుండిపోతాడని సూచిస్తాయి. ప్రభువు అనుగ్రహిస్తేనే తప్ప పాపి యూ పాపదశనుండి బయటపడలేడు.

22. అతడు ప్రాణాలను ధారవోసాడు - యెష53, 12

యెషయా ప్రవక్త తన ప్రవచనం 58వ అధ్యాయంలో బాధామయ సేవకుణ్ణి వర్ణించాడు. ఈ సేవకుడు బాధలనుభవించి మరణించాడనీ, ఇతని మరణం ద్వారా ప్రజలకు పాపవిమోచనం కలుగుతుందనీ చెప్పాడు. నూత్నవేదపు రచయితలు ఈ ప్రవచనాన్ని క్రీస్తునకు అన్వయించారు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషాలను భరించి అనేకులను నిర్దోషులను చేస్తాడు అంటాడు ప్రవక్త = 53, 11. "మనుష్యు కుమారుడు అనేకుల విమోచన క్రయధనంగా ప్రాణాలు ఈయడానికి వచ్చాడు" అంటుంది మార్ముసువార్త 10.45, “అతడు బాధింపబడినా నోరుతెరవలేదు. వధకు తేబడే గొర్రెపిల్లలాగ మౌనంగా వుండిపోయాడు" అంటాడు ప్రవక్త - 53,7. ప్రధాన యాజకుడు ప్రశ్నించినా గూడ "ఆయన ఉత్తర మీయకుండా మౌనంగా వుండిపోయాడు" అంటుంది మార్కు సువార్త 14,61. "ఆయన అనేకుల పాపాలను భరిస్తూ పాపం చేసినవారికోసం విజ్ఞాపనచేసాడు" అంటాడు ప్రవక్త 53.12. "తండ్రీ! వీళ్ళేమి చేస్తున్నారో వీళ్ళకే తెలీదు కనుక వీళ్ళను క్షమించు" అంటూ క్రీస్తు శత్రువుల తరపున విజ్ఞాపనం చేసాడు అంటుంది లూకాసువార్త 23.34 "అతడు మరణంచెంది ప్రాణాలను ధారవోసాడు" అంటాడు