పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తీసికోగూడదు. ఆనందానుభూతి మామూలుగా భక్తిమంతమైన జీవితానికి నిదర్శనం. అది సాధారణంగా సదాత్మ నుండే వస్తుంది. కాని ఒకోమారు మనలను మోసగించడానికై పిశాచం గూడ ఈ యానందానుభూతిని కలిగించవచ్చు. అప్పడు పిశాచాన్ని గుర్తించడం ఎలా?

7.మాములుగా మనం ప్రార్ధనం చేసుకొన్నపుడో, ఓ మంచి గ్రంథాన్ని చదివినపుడో, ఓ మంచి ప్రసంగం విన్నపుడో ఆనందానుభూతి కలుగుతుంది. కానీ ఒకోమారు ఈలాంటి పూర్వకారణాలు ఏమి లేకుండానే అకస్మాత్తుగా ఆనందానుభూతి కలుగుతుంది. ఉదాహరణకు, ఓ గృహిణి వంట చేసికొంటూండగా లేదా ఓ మఠకన్య బోర్డింగులో పిల్లలతో ఏదో పని చేయిస్తుండగా అకస్మాత్తుగా ఆనందానుభూతి కలుగుతుంది. ఇక్కడ పైన పేర్కొన్న ప్రార్ధన మొదలైన పూర్వకారణాలేమియా లేవు. ఈలా కారణ రహితంగా పుట్టిన ఆనందానుభూతి తప్పకుండా సదాత్మ నుండి వచ్చిందని చెప్పాలి. ఎందుకు? మన ఆత్మ దేవునికి సొంత యిల్లలాంటిది. దేవుడు మాత్రమే ప్రత్యక్షంగా నేరుగా ఆయాత్మ లోనికి ప్రవేశింపగలడు. పిశాచాలు దేవదూతలు మొదలైనవాళ్లు పరోక్షంగా, మన యింద్రియాల ద్వారా గాని మన ఆత్మ విూద పనిచేయలేరు. ఇక్కడ పేర్కొనబడిన ఆనందానుభూతి ప్రత్యక్షంగా ఆత్మలో కలిగిందేగాని పరోక్షంగా ప్రార్ధనాదుల వలన కలిగింది కాదు. కనుక ఇది దేవుని నుండి వచ్చిందే. కాని ఈలాంటి ఆనందానుభూతి చాల అరుదుగా గాని లభింపదు. కావున ఇది అసాధారణమైన ఆనందానుభూతి అని చెప్పాలి.

8. మామూలుగా పూర్వ కారణాన్ని పురస్కరించుకొనే ఆనందానుభూతి కలుగుతుంది. అనగా ప్రార్ధనం, సద్ధంథపఠనం, సదుపన్యాసం వినడం మొదలైన వాటి తర్వాతనే ఆనందానుభూతి కలుగుతుంది. కాని ఈ యనుభూతి సదాత్మనుండైనా కలుగవచ్చు, అసదాత్మనుండైనా కలుగవచ్చు. తెలిసికోవడం ఏలాగ? ఆనందానుభూతి సదాత్మనుండి వచ్చినట్లయతే మనలను తప్పకుండా పుణ్యమార్గంలో నడిపిస్తుంది. కాని అది పిశాచం నుండి వచ్చినట్లయితే మనలను అపమార్గం పట్టిస్తుంది. కనుక ఆ యానందానుభూతితో మనంచేసేపనే ఆయనుభూతి ఏయాత్మ నుండి వచ్చిందో తెలియజేస్తుంది. పండునుబట్టి చెట్టు ఏలాంటిదో నిర్ణయించమన్నారు. కనుక మనం చేసిన పనినిబట్టి మనలను సదాత్మే నడిపించిందో అసదాత్మే నడిపించిందో తెలిసికోవచ్చు. మనం ఓపనిచేస్తాం. దాని ప్రారంభమూ, మధ్యమూ అంతమూ - ఈమూడు దేవునికి ప్రియపడేలా జరిగిపోతే ఆపని సదాత్మ ప్రబోధంతో జరిగిపోయినట్లే. కాని ఆపని ప్రారంభం మాత్రం బాగుగానేవుండి దాని మధ్యమో అంతమో పాపానికి దారితీస్తే అది పిశాచం ప్రబోధంతో