పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. ఆనందానుభూతి

5. భక్తుల్లో ఆనందానుభూతి విచారానుభూతి అనే మనోభావాలు రెండుంటాయి. ఈ భావాల వల్ల మనకు ఉపకారమో అపకారమో జరుగుతుంటుంది. కనుక సాధకులు ఈ మనోభావాలను జాగ్రత్తగా గుర్తిస్తూండాలి. అవి యేయాత్మనుండి పట్టాయో తెలిసికోగలిగి వుండాలి. మొదట, ఆనందానుభూతి అంటే యేమిటో చూద్దాం. అది ఓ విధమైన ఆనందభావం, ఓ అనుభవం. ఈ యనుభవం కలిగినపుడు మనసు సృష్టివస్తువులను దాటిపోతుంది, సృష్టికర్తయైన భగవంతుణ్ణి ప్రేమిస్తుంది. ఆ భగవంతుని మిూదగల ప్రేమచే హృదయం స్పందించడం, ఒకోమారు ఆనంద బాష్పాలు రాల్చడం గూడ కద్దు. ఈ స్థితిలో వున్నపుడు పాపాలకు పశ్చాత్తాపం కలుగుతుంది. విశ్వాసమూ నమ్మికా దేవప్రేమా వృద్ధి చెందుతాయి. హృదయంలో శాంతీ సంతోషమూ తృప్తి నెలకొంటాయి, ఈ భావాలు మామూలుగా మనసులో కన్పిస్తాయి. ఒకోమారు ఈ భావాలు మనసు నుండి ఇంద్రియాలకు గూడ ప్రాకవచ్చు. అపుడు ఓ విధమైన శారీరక ఉల్లాసం పడుతుంది. చెలమలోని నీళ్లలాగ పైకి ఉబికివుబికి వచ్చే ఆనందభావం గోచరిస్తుంది. ఉత్తానక్రీస్తే తన భక్తులకు ఈ యానందానుభూతి అనే వరాన్ని ఇస్తుంటాడు- కొలో 3,1.

6. ఆనందానుభూతి ఎక్కడ నుండి వస్తుంది? మామూలుగా సదాత్మ నుండి వస్తుంది. అది దేవుడు తన భక్తులకు ఉచితంగా ఇచ్చే వరం. ఈ యనుభవమున్నపుడు భగవంతునికి సేవచేయడం సులభమనిపిస్తుంది. తెరచాప నెత్తినపుడు పడవ సులభంగా కదిలిపోతుంది. అలాగే ఆనందానుభూతిలో వున్నపుడు ఆధ్యాత్మిక జీవితం గూడ సుకరంగా సాగిపోతుంది. మనం దైవసేవకు పూనుకొనిన తొలినాళ్లలో భగవంతుడు ఈ యానందానుభూతిని అధికంగా ఇస్తూంటాడు. అమ్మ చిన్నపిల్లలకు మిరాయి పెట్టి బడికి పంపుతుంది. అలాగే భగవంతుడు కూడ ఈ మిఠాయితో మనలను తన సేవకు ఆకర్షించు కొంటూంటాడు.

ఆనందానుభూతి కలిగినపుడు మనం ఏలా ప్రవర్తించాలి? ఈ యనుభవం కలిగినపుడు సాధకుడు తానేమో భక్తుణ్ణి పోయానని విర్రవీగగూడదు. అది కేవలం దేవుని వరం గనుక వినయంగా వుండిపోవాలి. దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. మళ్ళా విచారానుభూతి యెప్పడు వచ్చిపడుతుందో అని భయపడుతుండాలి. ఐగుప్శన యేసేపు కరువకాలానికని ముందుగానే ధాన్యం సేకరించి వుంచాడు - ఆది 41,34-36, అలాగే భక్తుడు ఇప్పడు అనుభవించే ఆనందానుభూతి వలన భవిష్యత్తులో వచ్చే విచారానుభూతికి తట్టుకోగలుగుతాడు. కనుక ఈ వరం కోసం మనం భక్తితో ప్రార్థించాలి.

ఇంకో విషయం. ఆనందానుభూతిలో వున్నపుడు పూర్వం చేసికొన్న నియమాలను గాని తీసికొన్న మాటపటులను గాని మార్చుకోగూడదు. క్రొత్త మాటపట్టులను