పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువుకి ప్రియం కలిగించినట్లే
అన్యాయంనుండి వైదొలగితే
పాపపరిహారబలి సమర్పించినట్లే" - 35, 1-3

కడన యెషయా ఈలా బోధించాడు:
“దరిద్రులను పీడించే బంధాలను సడలిస్తే
వాళ్ళ మెడమీది అన్యాయపు కాడిని తొలగిస్తే
వాళ్ళకు స్వాతంత్ర్యం ప్రసాదిస్తే
అదే నాకు నచ్చిన ఉపవాసం,
మీ భోజనాన్ని పేదలకు గూడ వడ్డిస్తే
దిక్కులేని వారికి మీ యింటిలో ఆశ్రయమిస్తే
దీనులకు బట్టలు కట్టబెడితే
అక్కరలోవున్న తోడి జనాన్ని ఆదుకొంటే
అదే నాకు నచ్చిన వుపవాసం" – 58, 6-7

ప్రవక్తలు మెచ్చిన ఆరాధనం ఈలాంటిది. అది సాంఘిక న్యాయాన్నిపాటించేది. దిక్కుముక్కులేని దీనజనులను ఆదరించేది. హృదయంలోనుండి పుట్టకవచ్చేది. కనుకనే అది ప్రభువుకి ప్రియపడేది.

ఉపసంహారం

1. పూర్వవేదం జగత్సృష్టితో ప్రారంభమౌతుంది. కాని పూర్వవేద ప్రజలు ప్రభువుని తెలిసికొంది ఈ సృష్టిద్వారా కాదు, ఐగుప్తు నిర్గమనంద్వారా, ప్రభువు యిస్రాయేలీయులను ఐగుప్తునుండి తరలించుకొనివచ్చిన ఘట్టం పూర్వవేదానికి గుండెకాయలాంటిది. ఆ ప్రజల నిర్గమనానికి కారణం సాంఘిక అన్యాయమే. ఈ నిర్గమనంద్వారా యావే యిప్రాయేలీయులకు ఏకైక ప్రభువయ్యాడు. వాళ్లు పరస్పరం సోదరులయ్యారు.

2. యావే యిస్రాయేలీయులతో నిబంధనం చేసికొన్నాడు. వాళ్ల నిబంధన న్యాయాన్నిపాటించాలని తెలియజేస్తూ మోషే ముఖాన ధర్మశాస్తాన్ని ప్రసాదించాడు. ఈ ధర్మశాస్త్రంలో సాంఘిక న్యాయంకూడ ఓ ముఖ్యాంశం. దీనిలో పేదసాదల హక్కులు జాగ్రత్తగా పేర్కోబడ్డాయి. ధనవంతులు దుర్మారులై సాంఘిక న్యాయాన్ని పాటించనప్పుడు ప్రభువు ప్రవక్తలద్వారా వాళ్లను హెచ్చరించాడు. కనుక మొదట ఐగుప్తలోలాగే తర్వాత యెరూషలేములో గూడ యావే సాంఘిక న్యాయానికి నాయకుడు, పీడిత ప్రజలకు సంరక్షకుడు. ఎవరైనాసరే పేదప్రజలను దోచుకొని వారిని పీడిస్తే ప్రభువు వూరుకోడు.