పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రజలు దుర్మార్గాల్లో ఆరితేరిపోయారు
అధికారులూ న్యాయమూర్తులూ లంచాలు కోరుతున్నారు
పలుకుబడికలవాళ్ల కోరికలు నెరవేరుతున్నాయి" - 7, 2-3.
ధనవంతలు పేదలను పీడించడం నిత్యకృత్యాలయ్యాయి. ఆమోసు ఈలాపలికాడు:
"ధనవంతులు దరిద్రులను క్రిందపడవేసి
కాలితో తొక్కుతూన్నారు
వాళ్ళను త్రోవనుండి ప్రక్కకు నెడుతూన్నారు
తండ్రీ కొడుకూ ఒకే స్త్రీని కూడి
ప్రభువు నామం అపవిత్రపరుసూన్నారు" - 2,7.

ఈలాంటి అన్యాయపపరిస్థితుల్లో ఆమోసు ధనవంతులు పేదలను ఆదరించాలని ప్రచారం సాగించాడు. ధనవంతులకూ పేదలకూ మధ్యవున్న తారతమ్యం ప్రభువు చేసిన ఒడంబడికకు విరుద్ధమని బోధించాడు. ప్రభువు ధనవంతులను దారుణంగా శిక్షిస్తాడని గూడ హెచ్చరించాడు :

"శత్రువులువచ్చి ఈ దేశం చుట్టుముడతారు
కోటలను ముట్టడించి మేడలను కూలద్రోస్తారు
సింహం పట్టిన గొర్రెనుండి కాపరికి
రెండు కాల్లో ఒక చెవో దొరికినట్లే
సమరియాలో నేడు పాన్పులమీద
సుఖంగా దొర్లాడే వాళ్ళల్లో
కొద్దిమందే మిగులుతారు
సర్వశక్తిమంతుడైన ప్రభువు
యిస్రాయేలును ఈలా హెచ్చరించమంటున్నాడు
ఆ దినం నేను యిప్రాయేలును
వారి పాపాలకై నిశితంగా శిక్షిస్తాను" - 3, 11-14,
"మీరు పేద ప్రజలను పీడించి
వాళ్ళ ధాన్యాన్ని దోచుకొన్నారు గనుక
చెక్కడపురాళ్ళతో సుందరంగా నిర్మించుకొన్న
మీయిండ్లల్లో మీరు వసించరు
మక్కువతో నాటుకున్న మీ తోటలనుండి లభించే
ద్రాక్షసారాయాన్ని మీరు చవిజూడరు